
Mega 156: మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఒక హిట్టు ఒక ప్లాపు తన ఖాతాలో వేసుకున్నాడు. వాల్తేరు వీరయ్య ద్వారా హిట్ అందుకున్న చిరు.. భోళాశంకర్ ద్వారా ప్లాప్ ను మూట కట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత కుర్ర డైరెక్టర్లను లైన్లో పెట్టిన చిరు వరుస సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళుతున్నాడు. ఇప్పటికే మెగా 156, మెగా 157 అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందదే. ఈ మధ్య మెగా 156 ను వదిలేసి మెగా 157 పైనే ఫోకస్ ఎక్కువ పెడుతున్నాడు చిరు. బింబిసార సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో హైలైట్ అయిన డైరెక్టర్ వశిష్ట మెగా 157 కు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండడంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉండగా ఈమధ్య చిరు మోకాలికి సర్జరీ కావడంతో కొద్దిగా ఆలస్యం అవుతూ వచ్చింది.
Game Changer: ట్రోల్ అయినా కూడా అదే సాంగ్ దింపుతున్నావ్ చూడు.. శంకర్ మావా.. హ్యాట్సాఫ్
ఇక మెగా 156 గురించి మాట్లాడుకుంటే.. ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ అయిందని, చిరు ఆ డైరెక్టర్ ని అధికారికంగా త్వరలో ప్రకటిస్తాడని అనుకున్నారు. అయితే దసరా రోజున అభిమానులకు షాకిచ్చే న్యూస్ చెప్పాడు చిరు. తన లైన్లో మెగా 156 లేదు అంటూ తెలిపాడు. మెగా 157 గా తెరకెక్కుతున్న వశిష్ట సినిమానే మెగా 156 గా మార్చినట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో మెగా 156 పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కళ్యాణ్ కృష్ణ కథ నచ్చలేదనా.. ? లేక అతనిపై నమ్మకం లేదనా.. ? మరెందుకు చిరు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడో తెలియాల్సి ఉంది. ఇప్పటికే కళ్యాణ్ కృష్ణ.. నాగార్జునకు సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు లాంటి హిట్ సినిమాలు అందించాడు. ఆ తర్వాత చిరు కోసమే కథను రెడీ చేస్తున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇన్నేళ్లు వెయిట్ చేయించి ఇప్పుడు సడన్ గా కాదు అనడంతో కళ్యాణ్ కృష్ణ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని సోషల్ మీడియాలో వార్తలు నడుస్తున్నాయి. మరి ఇలాంటి డెసిషన్ చిరు ఎందుకు తీసుకున్నాడు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదని మెగా ఫాన్స్ చెప్పుకొస్తున్నారు.
The forces rise for the MEGA MASS BEYOND UNIVERSE ✨#Mega156 begins 🔮🔥
Happy Dussehra 🏹
MEGASTAR @KChiruTweets @DirVassishta @mmkeeravaani @NaiduChota @saimadhav_burra @UV_Creations pic.twitter.com/utFS8MXO3r
— UV Creations (@UV_Creations) October 23, 2023