
Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ ఛేంజర్ ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకపోవడంతో చరణ్ అభిమానులు ఎప్పటికప్పుడు అప్డేట్ అప్డేట్ అంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య ఒక అభిమాని అయితే ఏకంగా అప్డేట్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటానని కూడా బెదిరించాడు. ఇక గత కొన్ని రోజుల నుంచి దసరాకు కూడా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాదని సమాచారం అందడంతో చరణ్ ఫాన్స్ నిరాశకు గురయ్యారు. అయితే వారిని ఆనందపరచడానికి మేకర్స్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చి షాక్ ఇచ్చారు.
Sudheer Babu: హరోంహర.. ఈసారి దేవుడే నిన్ను కాపాడాలి అన్నా
గేమ్ ఛేంజర్ సినిమా నుంచి మొదటి లిరికల్ సాంగ్ ను దీపావళికి రిలీజ్ చేస్తామని పోస్టర్ ద్వారా తెలుపుతూ దసరా శుభాకాంక్షలు తెలిపారు. గత కొన్నిరోజుల క్రితం ఈ సినిమా నుంచి జరగండి అంటూ సాగే ఒక సాంగ్ లీకైన విషయం తెలిసిందే. సాంగ్ లీక్ పక్కన పెడితే ఆ లిరిక్స్ ఎంత ట్రోల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా థమన్ మ్యూజిక్ తో కూడిన ఆ లిరిక్స్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. అంత ట్రోల్ అయినా కూడా శంకర్ అదే సాంగ్ ను రిలీజ్ చేయడం ఆశ్చర్యంగా ఉందని పలువురు చెప్పుకొస్తున్నారు. లీక్ అయ్యింది కదా అందరూ అలవాటు పడిపోయి ఉంటారు అనుకుని శంకర్ రిలీజ్ చేస్తున్నాడా..? లేక మొదటి సాంగ్ ఇదే రిలీజ్ చేయాలని ఏమైనా అనుకున్నాడా..? అనేది తెలియాల్సి ఉంది. ఇంకోపక్క ఈ సాంగ్ రిలీజ్ అయిన వెంటనే మరోసారి ట్రోల్ అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయినా కూడా అన్నిటికీ ఓకే అనుకొని శంకర్ ఈ సాంగ్ ని దింపుతున్నాడు అంటే హ్యాట్సాఫ్ అనే చెప్పాలి అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో చూడాలంటే దీపావళి వరకు ఆగాల్సిందే.