
Errabelli Dayakar rao: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. టీపీసీసీ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్, ఒక చీటర్ అని రేవంత్ రెడ్డి ఎక్కడ కాళ్లు పెడితే అక్కడ పార్టీ నాశనం అయిపోతుందని ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఈ నెల 27 న కేసీఆర్ సభ నేపధ్యంలో సభాస్థలిని, హెలిప్యాడ్ ను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. భూపాలపల్లికి, ములుగు కు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు? అని ప్రశ్నించారు. గిరిజన తండాలకు ఆదివాసులకు ఏం చేశారు? అని మండిపడ్డారు. గిరిజన యూనివర్సిటీ ఇస్తానని ఇయ్యలేదని గుర్తు చేశారు. సమ్మక సారక్కకు జాతీయ హోదా కల్పిస్తా అని చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతానని అది కూడా చేయలేదని మండి పడ్డారు. ఇవన్నీ చేయకుండా రాహుల్ గాంధీ.. రేవంత్ రెడ్డి రాసిన స్క్రిప్ట్ చదువుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ ఖాయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.
సర్వేల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని, వారిని నమ్మవద్దని కొందరు సూచిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలు మళ్లీ కష్టాలు పడాల్సి వస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో అద్భుతంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఉద్యమనేతగా కేసీఆర్ మేనిఫెస్టోతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన మహానేత కేసీఆర్ అని, పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ప్రతిపక్షాలను వణికిస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రతి సామాజిక వర్గానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనేక రకాల పథకాలు అందించామన్నారు. పేదలకు సీఎం కేసీఆర్ అందిస్తున్న పథకాలు కేసీఆర్ కు మూడోసారి పట్టం కట్టడం ఖాయమన్నారు. 60 ఏళ్లు పాలించిన ఆయన కొత్తగా ఎలా చేస్తారని ప్రశ్నించారు. హక్కుల కోసం ఉద్యమాలు చేసిన వాళ్లని తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మరని అన్నారు. రైతుల రుణమాఫీ కూడా ఆలస్యమైందని, ఏ ఒక్క రైతుకు కూడా రుణమాఫీ జరగదని స్పష్టం చేశారు. అదే విధంగా కష్టకాలంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ప్రజలు ఆయనను గెలిపించి ఆదరించారు.
Rapid Rail: నమో భారత్ ట్రైన్లో ఫస్ట్ 10వేలమంది ప్రయాణం.. టికెట్ కొనకపోతే ఫైన్ తప్పదు