
Sudheer Babu: గత కొన్నేళ్లుగా నైట్రో స్టార్ సుధీర్ బాబు విజయం కోసం బాగా కష్టపడుతున్నాడు. విభిన్నమైన కథలను.. ప్రయోగాలను చేస్తున్నా.. విజయం మాత్రం అందుకోలేకపోతున్నాడు. అయినా నిరాశ పడకుండా విక్రమార్కుడిలా హిట్ కోసం పోరాడుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం హరోంహర. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్ఎస్ సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి నేపథ్యంలో సాగనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ ట్రిగ్గర్ వీడియోకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక నేడు దసరా కానుకగా.. ఈ సినిమా కొత్త పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Sudigali Sudheer: సుధీర్ తో పెట్టుకుంటే.. తలలు తెగిపడడమే
ఒక వేల్ పట్టుకుని, పసుపు దీక్షా దుస్తులలో సుధీర్ బాబు గుడి ముందు ఉన్న రాతిపై కూర్చున్నారు, అతని వెనుక గ్రామస్తులు ఉన్నారు. శరీరమంతా రక్తపు గుర్తులతో గాయాలయ్యాయి. మ్యాసీ హెయిర్, గడ్డంతో ఉన్న సుధీర్ బాబు పోస్టర్లో ఫెరోషియస్ గా కనిపిస్తున్నారు. పోస్టర్‌తో పాటు చిత్ర టీజర్‌కు సంబంధించిన అప్డేట్ను కూడా ఇచ్చారు మేకర్స్. టీజర్ దీపావళికి విడుదల కానుంది. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్-ఇండియా విడుదల కానుంది. ఇక ఇన్ని సినిమాలు ప్లాప్స్ అందుకున్నాకా వస్తున్నా సినిమా కావడంతో.. ఆ దేవుడే ఈ సినిమాను హిట్ చేయాలి అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమా సుధీర్ కు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.