Leading News Portal in Telugu

Devara: ఒక్క కత్తితో ఎంత పెద్ద విషయాన్ని రివీల్ చేసావ్ కొరటాల…


Devara: ఒక్క కత్తితో ఎంత పెద్ద విషయాన్ని రివీల్ చేసావ్ కొరటాల…

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ కొరటాల శివ దేవర సినిమా చేస్తున్నాడు. ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ గోవాలో స్టార్ట్ కానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ విలన్ గా నటిస్తున్న దేవర పార్ట్ 1 పాన్ ఇండియా ముందుకి ఏప్రిల్ 5న రాబోతుంది. భారీ కాన్వాస్ తో దేవర సినిమా చేస్తున్న కొరటాల శివ, హ్యూజ్ యాక్షన్ బ్లాక్స్ ని డిజైన్ చేసాడు. వయొలెన్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా ఎన్టీఆర్ ని ప్రెజెంట్ చేయనున్న కొరటాల శివ… ఒక ఇంపార్టెంట్ విషయాన్ని ఊహించని విధంగా రివీల్ చేసాడు. ఎన్టీఆర్ దేవర సినిమాలో రెండు క్యారెక్టర్స్ ని ప్లే చేస్తున్నాడు. ఇందులో ఒకటి తండ్రి పాత్ర, ఇంకొకటి కొడుకు పాత్ర.

తండ్రి పాత్ర లెఫ్ట్ హ్యాండెడ్ అనే విషయాన్ని కొరటాల చెప్పకనే చెప్పాడు. దేవర నుంచి ఇప్పటివరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ లో ఎన్టీఆర్ ది ఒక్క పోస్టర్ మాత్రమే ఉంది. ఇందులో ఎన్టీఆర్ బల్లెం పట్టుకోని, బ్లాక్ డ్రెస్ లో భయంపుట్టించే వీరుడిలా ఉన్నాడు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ ఎడమ చేత్తో ఆయుధాన్ని పట్టుకున్నాడు. లేటెస్ట్ గా దసరా ఆయుధపూజ అంటూ కొరటాల శివ మరో పోస్టర్ వదిలాడు. అందులో కేవలం కత్తిని మాత్రమే రివీల్ చేసాడు కొరటాల. ఈ కత్తిని కూడా ఎన్టీఆర్ ఎడమ చేత్తోనే పట్టుకున్నాడు. సో కొరటాల డిజైన్ చేసిన దాన్ని బట్టి ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న ఎన్టీఆర్ క్యారెక్టర్ కి ఎడమ చేతి వాటం అనమాట. మరి యంగ్ ఎన్టీఆర్ క్యారెక్టర్ కి ఎలాంటి స్పెషలిటీని డిజన్ చేసారు అనేది చూడాలి.