Leading News Portal in Telugu

Health Tips : బెల్లంను ఇలా తీసుకుంటే ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..


Health Tips : బెల్లంను ఇలా తీసుకుంటే ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..

బెల్లం తియ్యగా ఉంటుంది.. అందుకే వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా తింటారు.. డయాబెటీస్ ఉన్న వారు పంచదారకు బదులు బెల్లాన్ని వాడటం వల్ల బ్లడ్ లో షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. బెల్లంలో క్యాల్షియం, పోటాషియం, సోడియం, ఐరన్, వంటి పోషకాలు ఉండటం వల్ల అనేక సమస్యల నుంచి దూరం చేస్తుంది. రోజూ కొంత మోతాదులో బెల్లం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.. ఎటువంటి ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

బెల్లం తినడం వల్ల శరీరంలోని జీర్ణ ఎంజైమ్ లను ప్రేరేపిస్తుంది. దీని వల్ల జీర్ణ క్రియ అనేది మెరుగు పడుతుంది. దీంతో అజీర్ణం, మల బద్ధకం వంటి అపాన వాయువు వంటి జీర్ణ రుగ్మతలను నివారించుకోవచ్చు..

ఐరన్, ఫోలేట్ వంటి కంటెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే రక్త ప్రసరణను నిర్వహించడానికి, పీరియడ్స్ టైమ్ లో వచ్చే నొప్పి, తిమ్మిరి వంటివి తగ్గించడంలో బెల్లం హెల్ప్ చేస్తుంది..

అదే విధంగా.. బెల్లం తింటే రక్తం క్లీన్ అవుతుంది. రక్తం శుభ్ర పడటంతో చర్మం కూడా క్లియర్ అవుతుంది. దీంతో చర్మంపై ఉండే పింపుల్స్, ఇతర చర్మ వ్యాధులను నివారించడంలో సహాయ పడుతుంది..

బెల్లంలో ఇనుము కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. రక్త హీనతతో బాధ పడేవారు బెల్లాన్ని రెగ్యులర్ గా తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచేందుకు సహాయ పడుతుంది.

ఇక ఈబెల్లంలో కార్బోహైడ్రేడ్స్ ఉండటం వల్ల నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తుంది. దీని వల్ల రోజంతా ఫ్రెష్ గా ఉండొచ్చు..

ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ తో పోరాడడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది…

శరీరంలోని జీర్ణ ఎంజైమ్ లను ప్రేరేపిస్తుంది. దీని వల్ల జీర్ణ క్రియ అనేది మెరుగు పడుతుంది. దీంతో అజీర్ణం, మల బద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి.. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. రోజుకో చిన్న ముక్క తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..