
Narakasura Trailer Review: పలాస ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా నటించిన సినిమా “నరకాసుర”. ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించగా సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు. నవంబర్ 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో “నరకాసుర” మూవీ రిలీజ్ కాబోతోన్న క్రమంలో ఈ సినిమా ట్రైలర్ ను హీరో నాగశౌర్య రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ అయితే ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. భగవంతా నువ్వు నిర్మించుకున్న ఈ ప్రపంచం, ఈ ప్రపంచంలో నిన్నే నమ్ముకునే నీ వాళ్లు అంటూ బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌తో సాగే డైలాగ్స్‌తో మొదలైంది ఈ ట్రైలర్. ఇక ట్రైలర్ లో రక్షిత్ అట్లూరి ఓ వైపు లారీ డ్రైవర్‌గా మరోవైపు శత్రువులను చీల్చి చెండాడే వ్యక్తిగా డ్యుయల్ షేడ్స్‌లో కనిపించబోతున్నట్టు కనిపిస్తోంది. సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో కట్ చేసిన ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచడమే కాక ఆ ఫైట్లు భయపెడుతున్నాయి కూడా.
Bhagavanth kesari : భగవంత్ కేసరి సినిమాకు ముందు అనుకున్న టైటిల్ అదేనా..
ఇక ట్రైలర్ లాంచ్ తరువాత హీరో నాగశౌర్య మాట్లాడుతూ నరకాసుర సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నానని అన్నాడు. రక్షిత్ నాకు చైల్డ్ హుడ్ ఫ్రెండ్, వాడికి నడక రానప్పుడు ఎత్తుకునేవాడినని అన్నారు. బై బర్త్ వాడు రిచ్, సినిమాల్లోకి వస్తున్నాడు అన్నప్పుడు డబ్బుంది కదా సినిమాలు చేస్తాడు అనుకున్నా కానీ డబ్బు కాదు రక్షిత్ కు సినిమాల మీద ఎంతో ప్యాషన్ ఉంది, వాళ్ల నాన్నకి కూడా సినిమాలంటే చాలా ఇష్టం అని అన్నారు. వీళ్లు ఒక మంచి సినిమా చేయాలనే ఎప్పుడూ ఆలోచిస్తుంటారని పేర్కొన్న ఆయన పలాస సినిమా చేసినప్పుడు వెళ్లి చూశా, ఆ సినిమా అటెంప్ట్ చేయడం అంత ఈజీ కాదని అనాన్రు. రక్షిత్ ఆర్డినరీ మూవీస్ చేయడు కొత్త కథలు, రూరల్ బ్యాక్ డ్రాప్ మూవీస్ చేస్తాడన్న ఆయన తమిళం,మలయాళంలో మనం అలాంటి మూవీస్ చూస్తాం. ఇప్పుడు తెలుగులో రక్షిత్ చేస్తున్నాడు. అతన్ని ఎంకరేజ్ చేద్దాం. అన్నారు. ఇక ఈ సినిమాలో శతృ, నాజర్, చరణ్ రాజ్, తేజ చరణ్ రాజ్, శ్రీమాన్, గాయత్రి రవిశంకర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.