
Danchave Menatha Kutura song added in few screens today: నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కుమార్తె వరుసయ్యే పాత్రలో శ్రీ లీల నటించింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ దక్కింది. అనిల్ రావుపూడి కెరీర్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి చేసిన సినిమా కావడంతో నందమూరి బాలకృష్ణ పాత్రకు కూడా మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా బాడ్ టచ్ గుడ్ టచ్ గురించి స్కూల్లో నందమూరి బాలకృష్ణ చెబుతున్న సీన్ అయితే అందరికీ కనెక్ట్ అవుతుంది.
Aadikeshava: విజ్జి పాప గ్లామర్ డ్యాన్స్.. ఇరగదీసింది అంతే
అయితే సినిమా విడుదల చేస్తున్నప్పుడే దసరా వరకు ఒక పాట ఉండదు కానీ దసరా నుంచి నందమూరి బాలకృష్ణ దంచవే మేనత్త కూతురా రీమిక్స్ సాంగ్ యాడ్ చేస్తామని దర్శకనిర్మాతలు ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఎందుకొచ్చిన ప్రయోగాలు అని ఆ పాట పెట్టకూడదు అని నిర్ణయం తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈరోజు ప్రయోగాత్మకంగా పిండి తెలుగు రాష్ట్రాల్లో కొన్ని థియేటర్లలో ఈ పాటను యాడ్ చేశారు. ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో రేపటి నుండి భగవంత్ కేసరి ఆడుతున్న ప్రతి థియేటర్ లో ఈ పాట యాడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారు పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.