Leading News Portal in Telugu

Medigadda Barrage : సంచలనం రేపుతున్న మేడిగడ్డ బ్యారేజ్‌ పిల్లర్‌ ఘటన


Medigadda Barrage : సంచలనం రేపుతున్న మేడిగడ్డ బ్యారేజ్‌  పిల్లర్‌ ఘటన

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని లక్ష్మీ బ్యారేజ్ మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగిన ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పిల్లర్‌ కుంగడానికి ముందు అక్కడ పేలుడు శబ్దం వినిపించడంతో దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చప్పుడు ఎందుకొచ్చింది? పిల్లర్‌ ఎందుకు కుంగింది? ఇందులో కుట్ర కోణం ఏమైనా ఉందా? అని ఇరిగేషన్‌ అధికారులు అనుమానిస్తున్నారు.

దీంతో ఈ ఘటనపై ఇరిగేషన్ అధికారులు మంగళవారం మహదేవ్‌పూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ముందు ఇలాంటి ఘటన జరగడంతో ఏదైనా కుట్రలు ఉండొచ్చని.. దానిపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. ఇరిగేషన్‌ అధికారుల ఫిర్యాదుపై పోలీసులు సానుకూలంగా స్పందించారు. ప్రివెంటేషన్‌ ఆఫ్‌ డ్యామేజ్‌ టు పబ్లిక్‌ ప్రాపర్టీ యాక్ట్‌ (పీడీపీపీ ) సెక్షన్‌ 3, 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రత్యేక టీమ్‌తో విచారణ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా జయశంకర్‌ భూపాలపల్లి ఎస్పీ కిరణ్‌ ఖర్గే మాట్లాడుతూ.. ఇందులో మావోయిస్టుల ప్రమేయం లేదని తమ విచారణలో తేలిందని వెల్లడించారు. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతుందని.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు….