
టాలీవుడ్ యంగ్ హీరో హీరో విశ్వక్ సేన్ వరుస చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు…విభిన్న కథలను ఎంచుకుంటూ విభిన్న పాత్రలలో నటిస్తూ ఎంతగానో మెప్పిస్తున్నాడు…ప్రతి సినిమాకు కొత్తదనం చూపిస్తూ తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటున్నారు. నటుడిగా మరియు నిర్మాతగా వరుస చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. చివరిగా ఈ హీరో ‘దాస్ కా ధమ్కీ’ చిత్రంతో అలరించారు. ఇక ప్రస్తుతం విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ చిత్రంలో లంకల రత్న అనే పాత్రలో అలరించబోతున్నారు. మునుపెన్నడూ చూడని పాత్రలో , సరికొత్త బాడీ లాంగ్వేజీతో విశ్వక్ ఆకట్టుకోనున్నారు. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. డీజే టిల్లు ఫేమ్ హీరోయిన్ నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.ఇప్పటికే చిత్రం నుంచి విడుదల అయిన పోస్టర్స్ మరియు సాంగ్స్ సినిమాపై మరింత బజ్ ను క్రియేట్ చేశాయి. ఇక దసరా పండుగ సందర్భంగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రం నుంచి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. రాజకీయ ప్రచారంలో జీప్ పై ఊరేగింపుగా వస్తున్న పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. తెల్ల చోక్కా, పట్టుపంచెలో నాయకుడిగా విశ్వక్ ఆకట్టుకుంటున్నారు. పోస్టర్లతోనే విశ్వక్ పాత్రపై యూనిట్ మరింతగా క్యూరియాసిటీ పెంచేస్తోంది.పీరియాడిక్ పొలిటికల్ టచ్ తో ఈ మూవీ తెరకెక్కుతోందని తెలుస్తోంది. 1980 ఆ ప్రాంతంలో గోదావరి నేపథ్యంలో జరిగే కథ ఇది అని సమాచారం.హీరోయిన్ అంజలి ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. అలాగే కమెడియన్ హైపర్ ఆది కూడా మరో ముఖ్య పాత్రలో అలరించనున్నారు. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 8 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.