Leading News Portal in Telugu

Uttam Kumar Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే మీ ఉత్తమ్ అన్న మంచి పదవిలో ఉంటాడు..


Uttam Kumar Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే మీ ఉత్తమ్ అన్న మంచి పదవిలో ఉంటాడు..

సూర్యాపేట జిల్లా వేపల సింగారం గ్రామంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు పర్యటించారు. గ్రామంలోకి చేరుకున్న ఉత్తమ్‌కు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. హుజూర్‌నగర్ లో 50వేల మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే మీ ఉత్తమ్ అన్న మంచి పదవిలో ఉంటాడని ఆయన వ్యాఖ్యానించారు. హుజుర్‌ నగర్ లో దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదు…. కానీ ఎమ్మెల్యే సైదిరెడ్డి 300 ఎకరాలు సంపాదించాడని ఆయన మండిపడ్డారు.

ఇప్పుడు ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి ఈ5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే మొదటి మెట్టు అని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది.. రాహుల్ ప్రధాని కావడం ఖాయమన్నారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. అందరినీ కలుపుకొని ముందుకు సాగి, పార్టీని అధికారంలోకి తీసుకు వస్తామన్నారు. తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు.