Leading News Portal in Telugu

Israel Warned Hamas: మా వాళ్లను వదిలిపెట్టండి.. హమాస్ కు వార్నింగ్ ఇచ్చిన ఇజ్రాయెల్


Israel Warned Hamas: మా వాళ్లను వదిలిపెట్టండి.. హమాస్ కు వార్నింగ్ ఇచ్చిన ఇజ్రాయెల్

Israel hamas war: ఇజ్రాయిల్ హమాస్ మధ్య మొదలైన యుద్ధఖాండ నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాల మధ్య రగులుతున్న ఈ యుద్ధ జ్వాలల్లో అమాయక ప్రజలు ఆహుతైపోతున్నారు. ఇప్పటికే ఇరు దేశాలకు చెందిన ప్రజలు వేల మంది ప్రాణాలను కోల్పోయారు. కొందరు హమాస్ ఆధీనంలో బందీలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ తమ వాళ్ళను వదిలిపెట్టాల్సిందిగా హమాస్ ను హెచ్చరించింది. వివరాలలోకి వెళ్తే.. అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయిల్ పై ఆకస్మిక దాడి చేసింది. కరుణన్నదే లేకుండా కనిపించిన వాళ్ళని కనిపించినట్లు విచక్షణారహితంగా చంపేశారు హమాస్ ఉగ్రవాదులు. అలానే 200 మందికి పైగా ఇజ్రాయిల్ పౌరులను బంధించారు. కాగా హమాస్ ను నాశనం చేస్తామని ఇజ్రాయిల్ ప్రతిజ్ఞ చేసింది. అన్నట్టుగానే గాజా పైన బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయిల్. ఈ ఘటనలో గాజా పౌరులు 4500 మందికి పైగా మరణించారు.

Read also:WHO: గాజాలో విచ్ఛిన్నమవుతున్న ఆరోగ్య వ్యవస్థ.. ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ చేయాలి

ఇప్పటికి ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. కాగా మానవతా ప్రతిపాదన కింద హమాస్ అంధీనంలో ఉన్న ఇజ్రాయిల్ పౌరులను విడిచిపెట్టాలని ఇజ్రాయిల్ హమాస్ కు వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే హమాస్ అంధీనంలో ఉన్న బందీలల్లో ఇద్దరు అమెరికన్లను విడిచి పెట్టింది హమాస్ . అయితే మిగిలిన వాళ్ళను కూడా విడిచిపెట్టాలని.. హమాస్ రహస్యాలను గోప్యంగా ఉంచుతాము అని హామీ ఇస్తున్నాం. మా వాళ్ళను విడిచి పెట్టి మీరు మానవతా దృక్పధాన్ని చాటుకోండి. అది మీకే మంచింది. మీ భావితరాల భవిష్యత్తు కోసం శాంతిని పాటించండి. మీరు మావాళ్లను వదిలి పెడితే మీకు ఆర్ధిక సహాయం చేయడానికి కూడా ఇజ్రాయిల్ సిద్ధంగా ఉంది. కాదు విడిచిపెట్టే ప్రసక్తే లేదు అంటే హమాస్ పైన ఇజ్రాయిల్ చేసే దాడులు తీవ్రతరంగా ఉంటాయని ఇజ్రాయిల్ హమాస్ ను హెచ్చరించింది