Leading News Portal in Telugu

Israel: ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంటే ప్రధాని నెతన్యాహు కుమారుడెక్కడ.?


Israel: ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంటే ప్రధాని నెతన్యాహు కుమారుడెక్కడ.?

Israel: అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై పాలస్తీనా హమాన్ మిలిటెంట్ సంస్థ క్రూరమైన దాడికి పాల్పడింది. ఈ దాడిలో 1400 మంది ఇజ్రాయిల్ పౌరులు మరణించారు. అయితే అప్పటి నుంచి గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ వైమానిక బలగాలు నిప్పుల వర్షాన్ని కురపిస్తున్నాయి. హమాస్ ఉగ్రవాదులు ఉన్నారని అనుమానం వచ్చినా కూడా ఆ భవనాలను నామరూపాలు లేకుండా చేస్తోంది. ఇజ్రాయిల్ జరిగిన దాడుల్లో ఇప్పటి వరకు గాజాలో 5000 మంది చనిపోయారు. వీరిలో సాధారణ పౌరులు, పిల్లలు కూడా ఉన్నారు.

ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ హమాస్ ని మట్టుపెట్టేదాకా వదబోమని హెచ్చరించారు. ప్రపంచంలో నలుమూల ఉన్న యూదులు సొంతదేశం రక్షణ కోసం ఇజ్రాయిల్ తరలివచ్చి, సైన్యంలో జాయిన్ అయ్యారు. అయితే ప్రధాని కొడుకు యైర్ నెతన్యాహూ మాత్రం ఇజ్రాయిల్ రాకపోవడంపై అక్కడి ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇంత పెద్ద యుద్ధంలో ఇజ్రాయిల్ ఉన్న సమయంలో ప్రధాని కొడుకు అమెరికాలో ఉండటంపై విమర్శలు వస్తున్నాయి.

32 ఏళ్ల యైర్ ఈ ఏడాది ప్రారంభంలో ఫ్లోరిడాకు వెళ్లారు. అక్కడి బీచ్ లో ఉన్న ఫోటోల ప్రస్తుతం ఇజ్రాయిల్ లో వైరల్ అయింది. సొంతదేశ రక్షణకు చాలా మంది పోరాడుతుంటే.. అతను మాత్రం మియామిలో ఆనందిస్తున్నాడని పలువురు విమర్శలు గుప్పించారు. అయితే తాజా వైరల్ అవుతున్న ఫోటో ఎప్పటిదనే దాన్ని సరైన ధృవీకరణ లేదు.

టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ ఉత్తరాన లెబనాన్ సరిహద్దులో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్న ఓ వాలంటీర్ తో మాట్లాడింది.. నేను ముందు నిలబడ్డాను యైర్ నెతన్యాహూ మియామీ బీచులో జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు, మేము మా కుటుంబం, పిల్లలను వదిలేసి, మాతృదేశ రక్షణకు పోరాడుతున్నామని అతను చెప్పాడు.

గాజా సరిహద్దుల్లో ఉన్న మరో ఇజ్రాయిల్ సైనికుడు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నేను నా జీవితం, నా కుటుంబం, ఉన్న ప్రాంతాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చాను, నా దేశాన్ని, నా ప్రజలను ఈ క్లిష్టమైన సమయంలో వదిలేయలేదు, కానీ ఈ సమయంలో ప్రధాని కుమారుడు ఎక్కడ ఉన్నాడు..? ఇజ్రాయిల్ లో ఎందుకు లేడు..? అని ప్రశ్నించాడు. ప్రధాని కొడుకుతో పాటు అంతరం ఐక్యంగా దేశాన్ని రక్షించుకోవాలని అని అన్నాడు.

యైర్ నెతన్యాహూ, ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ మూడో భార్య సారా కొడుకు. తండ్రి లాగే దుందుడుకుగా వ్యవహరిస్తుంటాడు. తరుచుగా ఇస్లామిక్ వ్యతిరేక పోస్టులు పెడుతుంటాడు. 2018లో.. ముస్లింలంతా వెళ్లిపోయే వరకు ఇజ్రాయిల్ లో శాంతి ఉండదని ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. దీంతో 24 గంటల పాటు అతని అకౌంట్ బ్లాక్ చేయబడింది. ఈ ఏడాది ప్రారంభంలో బెంజిమిన్ నెతన్యాహూ, సారా తన యైర్ నెతన్యాహూను సోషల్ మీడియా పోస్టు పెట్టొద్దని హెచ్చరించారు. చట్ట సభ సభ్యులు, మంత్రులతో నేరుగా మాట్లాడవద్దని యైర్ కి సూచించాని ఇజ్రాయిల్ టైమ్స్ వెల్లడించింది.