Leading News Portal in Telugu

Ooru Peru Bhairavakona : సెకండ్ సాంగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..


Ooru Peru Bhairavakona : సెకండ్ సాంగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..

టాలీవుడ్‌ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరో గా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవ కోన..ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్‌ నిజమే నే చెబుతున్నా లిరికల్ వీడియో సాంగ్‌ ను లాంఛ్ చేయగా.. నెట్టింట టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో వర్ష బొల్లమ్మ సందీప్ కిషన్ సరసన హీరోయిన్‌ గా నటిస్తోంది. హాస్య మూవీస్ బ్యానర్‌ పై తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్‌ నిజమే నే చెబుతున్నా లిరికల్ వీడియో సాంగ్‌ చాట్ బస్టర్ గా నిలిచింది. ఈ పాట కు బాగా క్రేజ్ లభిస్తుంది. అయితే చాలా రోజుల కు ఈ మూవీ నుంచి మేకర్స్ రెండో సాంగ్‌ అప్‌డేట్ అందించారు.

ఈ మూవీ సెకండ్ సింగిల్‌ హమ్మ హమ్మ ప్రమోషనల్ టీజర్‌ ను రేపు సాయంత్రం 4:05 గంటలకు లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఫుల్ సాంగ్‌ ను అక్టోబర్ 28 న గ్రాండ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. మీరంతా ప్రేమలో పడిపోయే మరో స్పెషల్‌ సాంగ్ హమ్మ హమ్మ వచ్చేస్తుంది.. తాజా అప్‌డేట్‌ ను అందరి తో షేర్ చేసుకున్నాడు సందీప్‌ కిషన్‌.ఈ చిత్రానికి శేఖర్ చంద్ర అద్భుతమైన మ్యూజిక్ ను అందించారు.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ దశ లో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ పై మేకర్స్‌ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్‌ సుంకర సమర్పణలో రాజేశ్‌ దండా నిర్మిస్తున్నారు. టైగర్‌ తర్వాత సందీప్‌ కిషన్‌, వీఐ ఆనంద్‌ కాంబినేషన్‌ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఈ సారి ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వస్తున్న ఆనంద్‌ ప్రేక్షకులను ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి..ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయిన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.

https://twitter.com/sundeepkishan/status/1717140349049815053?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1717140349049815053%7Ctwgr%5Eb045612176f047719afc9bcf7230a01ddc60fc0b%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F