
విశాఖలో నోట్ల కట్టలు కలకలం రేపాయి.. అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న భారీగా హవాలమనీ పట్టుబడింది… ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఏడి వద్ద ఓ వాహనంలో వాషింగ్ మిషన్లు తరలిస్తుండగా పోలీసులు తనిఖీలు చేపట్టారు.. తనిఖీల్లో భాగంగా సుమారు రూ.కోటి 30 లక్షల రూపాయలు నగదు ఎటువంటి పత్రాలు లేకుండా పట్టుబడింది.. విశాఖ నుండి విజయవాడ మీదుగా హైదరాబాద్ తరలిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.. సీఆర్పీసీ 41, 102 సెక్షన్ల కంద కేసు నమోదు చేశారు పోలీసులు.
నగదుతో పాటు వాహనాన్ని సీజ్ చేసి నగదు తరలిస్తున్న వారిని కోర్టులో హాజరు పరిచారు. దీనిపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.. అయితే, నోట్ల కట్టలు ఎవరివనే విషయం కానీ, నగదుకు సంబంధించిన ఇతరత్రా ఆధారాలు కానీ చూపించలేదు. దీంతో నగదుతో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆటోను సీజ్ చేసి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మిగతా వివరాలను పోలీసులు వెల్లడించలేదు. నగరంలోని ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ నుంచి ఈ నోట్ల కట్టలను తరలిస్తున్నట్లు తెలుస్తోంది.