Leading News Portal in Telugu

England vs Sri Lanka: శ్రీలంకతో పోరు.. ఇంగ్లండ్‌కు ఆఖరి అవకాశం!


England vs Sri Lanka: శ్రీలంకతో పోరు.. ఇంగ్లండ్‌కు ఆఖరి అవకాశం!

England vs Sri Lanka Playing 11: వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా నేడు శ్రీలంక, ఇంగ్లండ్‌ మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నేటి మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచులలో ఒక విజయం సాధించిన శ్రీలంక, ఇంగ్లండ్‌ జట్లకు సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇక నుంచి అన్ని గెలవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి.

ప్రపంచకప్‌ 2023లో మిణుకుమిణుకుమంటున్న ఆశలను సజీవంగా ఉంచుకోవడానికి డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌కు చివరి అవకాశం. మూడు ఓటములతో ఇప్పటికే సెమీస్‌ మార్గాన్ని క్లిష్టంగా మార్చుకున్న ఇంగ్లీష్ జట్టు పేలవ ఫామ్ కనబర్చుతున్న లంకతో చావోరేవో తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే ఇంగ్లండ్‌ పని అయిపోయినట్లే. టోర్నీలో ఇప్పటివరకూ బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. డేవిడ్‌ మలన్‌, జో రూట్‌ పర్వాలేదనిపించారు. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన చిన్నస్వామి స్టేడియంలో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.

తుది జట్టు (అంచనా):
ఇంగ్లండ్‌: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, గుస్ అట్కిన్సన్/మార్క్ వుడ్.
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరెరా, కుసల్ మెండిస్ (కెప్టెన్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దుషన్ హేమంత/దునిత్ వెల్లలగే, చమిక కరుణరత్నే/ఏంజెలో మాథ్యూస్, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, డిల్షన్ రజిత.

డ్రీమ్ 11 టీమ్:
వికెట్ కీపర్లు: జోస్ బట్లర్, కుసాల్ మెండిస్
బ్యాటర్స్: జో రూట్, డేవిడ్ మలన్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, పాతుమ్ నిస్సాంక
ఆల్ రౌండర్: డేవిడ్ విల్లీ
బౌలర్లు: ఆదిల్ రషీద్, కసున్ రజిత, దిల్షాన్ మధుశంక
కెప్టెన్: డేవిడ్ మలన్
వైస్ కెప్టెన్: జోస్ బట్లర్