
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంట వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరుకానున్నారు. ఉదయం 10.15 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి రాజానగరం మండలం దివాన్‌చెరువుకు చేరుకోనున్నారు. డి.బి.వి.రాజు లే–అవుట్‌లో జరగనున్న వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం సీఎం జగన్ బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం దివాన్ చెరువుకు రానున్నారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ వివాహ రిసెప్షన్‌కు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరు కె. మాధవీలత, ఎస్పీ జగదీష్, తదితర అధికారులు భద్రతా ఏర్పాట్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇక్కడి డీవీబీ రాజు లేఅవుట్‌లో సోదరుడు గణేష్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జక్కంపూడి రాజా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.