అమెరికాలో కాల్పుల కలకలం.. 22 మంది మృతి | indiscriminate shooting in america| 22| dead| culprit| escape| amergency
posted on Oct 26, 2023 11:29AM
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మైనేలోని లెవిస్టన్ ప్రాంతంలో దుండగుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో కనీసం 22 మంది మరణించారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు.
భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి ఆండ్రోస్కోగ్గిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయంలో ఈ ఘటన జరిగిందని లెవిస్టన్‌లోని సెంట్రల్ మైనే మెడికల్ సెంటర్ ఒక ప్రకటనను విడుదల చేసింది. అలాగే ఈ కాల్పులకు పాల్పడిన దుండగుడు పరారయ్యాడని ఆ ప్రకటనలో పేర్కొంది.
అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దుండగుడి చేతిలో ఆయుధాలు ఉండటంతో అతడు మరోసారి కాల్పులకు పాల్పడే ప్రమాదం ఉందన్న ఆందోళేన వ్యక్తం అవుతున్నది. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ అలర్ట్ జారీ చేశారు.