Leading News Portal in Telugu

Dharmana Prasada Rao: చాలా మందికి మంచి పదవులు రాబోతున్నాయి.. రాబోయే ఎన్నికలు ఓ సవాల్..!


Dharmana Prasada Rao: చాలా మందికి మంచి పదవులు రాబోతున్నాయి.. రాబోయే ఎన్నికలు ఓ సవాల్..!

Dharmana Prasada Rao: ఇంకా చాలా మందికి మంచి మంచి పదవులు రాబోతున్నాయని తెలిపారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఒకేసారి 32 లక్షల మందికి ఇళ్లు ఇస్తే చిన్న స్థలం ఇచ్చారని చంద్రబాబు అనడం హాస్యాస్పదం.. కానీ, మేం 12 వేల 8 వందల కోట్లతో భూమి కొన్నాం.. 32 లక్షల మందికి పంచాం అన్నారు. కార్యకర్తలు గమనించాలి.,. ప్రభుత్వం డబ్బులు పంచేస్తున్నారనడం తప్పు.. ప్రజలకు సంక్షేమ ఫలాలు డైరెక్టుగా ఇస్తున్నాం.. అవినీతి లేకుండా అన్నారు. విద్యుత్తు మన రాష్ట్రం కన్నా చవకగా ఉందా..? అని ప్రశ్నించారు. టీడీపీ వాళ్లకు మాట్లాడే అర్హత లేదు.. అవినీతి లేకుండా చేసిన ఘనత మనదే అన్నారు. ఏ ఒక్కరూ తలవంచ కుండా ఆత్మగౌరవంతో పేద ప్రజలు ఉన్నారు.. 2014 ఎన్నికల్లో గెలిపిస్తే రాష్ట్రాన్నికి చంద్రబాబు ఏమీ చేశారని నిలదీశారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని ఇక్కడకు పరిగెత్తుకు వచ్చావు.. 10 ఏళ్లు అక్కడే ఉండి మనం రాష్ట్రాన్ని నిర్మించుకొని వస్తే బాగుండేది కదా? అని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం చంద్రబాబు కష్టపడుతున్నాడు అనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

సిల్క్ డెవెలెప్ మెంట్ కేసులో జర్మనీ వారు డైరెక్టుగా చెప్పారు.. మీ రాష్ట్రానికి మాకు సంబంధం లేదని.. మీ డబ్బు మాకు చేరలేదు అని ఆ కంపెనీ చెప్పింది.. షెల్ కంపెనీలు మన పోలీసులు పట్టుకొని విచారిస్తే చంద్రబాబు పీఏకి, లోకేష్ కి ఆ డబ్బు చేరిందని తేలిందన్నారు ధర్మాన.. ఈడీ, ఐటీలు అందరి వద్ద సిల్క్ డెవెలెప్మెంట్ వివరాలు ఉన్నాయని తెలిపారు. ఇక, పలసాలో ఉద్దాన కిడ్నీ ప్రాంతవాసులకు సురక్షిత నీరు వస్తుంది.. ఇది జగన్మోహనరెడ్డి మీకు కోసం పనిచేసింది కదా..? అని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు 23 కేంద్ర సంస్థలలో ఒక్క సంస్థ కూడా శ్రీకాకుళంలో పెట్టలేదు.. ఇప్పుడు బాబుకు ఓటు అడగడానికి అర్హత లేదు.. ఈ ఇచ్చాపురంలో ఓటు బాబు అడగగలడా? అని ప్రశ్నించారు. వెనుకబడిన ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయడంలో బాబు ఫెయిల్ అయ్యారని విమర్శించారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయడంలో మా ప్రభుత్వం ముందు ఉన్నది అనడానికి మీరు చూస్తున్న అభివృద్దే కారణంగా పేర్కొన్నారు. ఇటువంటి ప్రభుత్వం కొనసాగించాల్సిన బాధ్యత మీపై ఉంది.. రాబోయే ఎన్నికలు మనకు ఓ సవాల్.. ఇచ్చాపురంలో ఉన్నవారిలో లీడర్ షిప్‌ కు అవకాశం మన సీఎం ఇచ్చారని తెలిపారు.. పిరియా సాయిర్జ్, విజయమ్మ, రామారావు, ఇలా చాలా మంది ఇక్కడ నుండే నాయకులు వచ్చారు.. ఇంకా చాలా మందికి మంచి మంచి పదవులు రాబోతున్నాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

అన్ని కులాలకు సమానంగా చూస్తున్నాం.. రాబోయే ఎన్నికల్లో ఇచ్చాపురంలో మనం గెలవాలని ఆకాక్షించారు ధర్మాన ప్రసాదరావు.. ఎంపీ రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు ఏమి మాట్లాడుతారో అర్ధం కాదని ఎద్దేవా చేసిన ఆయన.. అడిగినా అడగకపోయినా ఈ ప్రాంత అభివృద్దికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. మూలపేట పోర్టు శరవేగంగా పనులు జరుగుతున్నాయి.. మరికొద్ది నెలలో షిప్పులు ఆగే రోజులు రాబోతున్నాయన్నారు. 800 కోట్ల రూపాయలతో ఉద్దానంకు మంచినీరు అందిస్తున్నాం.. పలాసాలో కిడ్నీ ఆసుపత్రి, డయాలసిస్ కేంద్రం ఏర్పాటు, రక్షిత మంచినీరు అందిస్తుంది ఈ ప్రభుత్వం అన్నారు.. పేదలకు ఇల్లు ఇచ్చిన ఘనత మాదే.. ఎవడైనా మీ వీధికి వస్తే ఫోరా వెధవ మీకు ఎన్నో సంవత్సరాలు అధికారం ఇస్తే ఏమి చేశావో అని నిలదీయాలన్నారు. కార్యకర్తల చేతుల్లోనే అంతా జరగాలని వద్దు.. గౌరవంగా మనం ఉండాలి.. ప్రజలకు సేవ చేస్తున్నాం.. సాధికారిక అనేది మనం చూపాం.. అందరికీ అధికారం పంచాం.. మంచి భవిష్యత్తు ఉండాలని, బడి, వైద్యం, విద్య అందించాం.. స్వార్ధం కోసం వచ్చే వారిని దూరం పెట్టాలి.. ఇచ్చాపురంలో టీడీపీ పీడను వదిలించాలని పిలుపునిచ్చారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.