
Assam: అస్సాంలోని హిమంత బిశ్వసర్మ సర్కార్ బహూభార్యత్వం, బాల్య వివాహాలపై ఉక్కుపాదం మోపుతోంది. బహుభార్యత్వాన్ని నిషేధించేందుకు తన ప్రభుత్వం చట్టాన్ని రూపొందించే పనిలో ఉందని హిమంత ఆగస్టులో పేర్కొన్న తరుణంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలక హెచ్చరికలు చేసింది. అసోం ప్రభుత్వం తన ఉద్యోగులను జీవిత భాగస్వామి జీవించి ఉంటే మరొకరిని వివాహం చేసుకోకుండా నిషేధించింది, వారు ద్వంద్వ వివాహానికి పాల్పడితే శిక్షార్హమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Read Also: NIA Court: హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో తీర్పు.. 11 మందికి పదేళ్లు జైలు శిక్ష
అస్సాం సివిల్ సర్వీసెస్(కండక్ట్) రూల్స్ 1965లోని రూల్ 26 నిబంధనల ప్రకారం భార్య జీవించి ఉన్న ఏ ఉద్యోగి అయినా మొదటగా ప్రభుత్వ అనుమతి పొందకుండా మరొక వివాహం చేసుకోకూడదని తెలుపుతుంది. భార్య ఉన్న వ్యక్తిని ఏ మహిళా ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రభుత్వ అనుమతి లేకుండా పెళ్లి చేసుకోకూడదని అస్సాం సీఎస్ నీరజ్ వర్మ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే నిర్భంద పదవీ విరమణతో పాటు పెనాల్టీ విధించడంతో పాటు చర్యలు తీసుకుంటామని ఉద్యోగుల్ని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రభుత్వం ఉద్యోగులే ఇలా చేస్తే ఇది సమాజంపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.