Leading News Portal in Telugu

Minister Roja: నిజం గెలవాలి.. మిగతా స్కాముల్లో కూడా దొరకాలి..!


Minister Roja: నిజం గెలవాలి.. మిగతా స్కాముల్లో కూడా దొరకాలి..!

Minister Roja: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. అయితే, రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్‌చేశారు.. ఆయన అరెస్ట్‌ అక్రమం.. నిజం గెలవాలి అంటూ.. నారా భువనేశ్వరి యాత్ర చేపట్టారు.. ఆ యాత్రపై కౌంటర్‌ ఎటాక్‌ దిగారు అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు.. నిజం గెలవాలి.. మిగతా స్కాముల్లో కూడా చంద్రబాబు దొరకాలి అంటూ వ్యాఖ్యానించారు మంత్రి ఆర్కే రోజా..

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్‌ జైలులో పెట్టిన తర్వాత.. టీడీపీ నేతలు చిన్న మెదడు చితికిపోయినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు మంత్రి రోజా.. అసలు వందల కోట్లు చంద్రబాబు దోచుకోకపోతే.. ఇన్ని రోజులు చంద్రబాబు జైలులో ఎందుకు ఉంటాడు అని ప్రజలు ఆలోచిస్తున్నారని తెలిపారు.. కోట్లాది రూపాయాలు వెచ్చించి ఢిల్లీ నుంచి లాయర్లు వచ్చి వాదిస్తున్నా.. చంద్రబాబు బయటకు రావడం లేదన్న ఆమె.. ఒక్క కేసులో ఒక్క ఆధారంతోనే ఇన్ని రోజులు జైలులో ఉన్నాడంటే.. అన్ని కేసుల్లో నిజాలు బయటకు వస్తే.. జీవితాంతం జైలులోనే ఉండాల్సి వస్తుందని చంద్రబాబుకు కూడా అర్థమైంది.. అందుకే నిజం గెలవాలి అంటూ భువనేశ్వరితో యాత్ర ప్రారంభించారని విమర్శించారు.. మేం కూడా అదే కోరుకుంటున్నాం.. నిజం గెలవాలి.. అన్ని కేసుల్లో చంద్రబాబు ప్రమేయం బయటకు రావాలన్నారు.. అసలు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ వేల కోట్లు ఎలా సంపాదించాలో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అంతేకాదు.. నా ఆస్తులపై చర్చ పెడుతున్నారు.. నా ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధం అని ప్రకటించారు మంత్రి ఆర్కే రోజా.. దీనిపై సీబీఐకి ఒకే లెటర్‌ రాద్ధాం.. మీ ఆస్తులు.. నా ఆస్తులు తెలాలంటూ సవాల్‌ చేశారు మంత్రి రోజా.