చంద్రబాబు ఆరోగ్యంతో జైలు అధికారుల చెలగాటం! | jail authorities hiding babu health condition| doctors| report| tamper| actual| report
posted on Oct 26, 2023 11:59PM
రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న తెలుగుదేశం అధినేత ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం అవుతున్నది. జైలు అధికారులు వాస్తవాలను దాచిపెట్టి వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇచ్చిన నివేదికలు మార్చి ప్రకటిస్తుండటంతో అసలు వాస్తవంగా చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉందన్న విషయంలో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. చంద్రబాబు ఆరోగ్యంపై రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు.. అంతా బాగానే ఉందంటూ విడుదల చేసిన హెల్త్ బులిటిన్, అదే ప్రభుత్వ వైద్యులు వారు జైలు అధికారులకు అందించిన నివేదికనే నారా భువనేశ్వరికి సైతంఆయన భార్య నారా భువనేశ్వరికి అందించారు. అయితే ప్రభుత్వ వైద్యులు వైద్యులు ఇచ్చిన నివేదిక కాకుండా దానిని మార్చి చంద్రబాబు ఆరోగ్యం బాగుందంటూ బెలిటెన్ ను విడుదల చేయడం దిగ్భ్రాంతి కొలుపుతోంది. ఇలా తప్పుడు వివరాలతో చంద్రబాబు హెల్త్ బులిటిన్ ను జైలు అధికారులు విడుదల చేసినట్లు వెల్లడి కావడంతో సర్వత్రా బాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం అవుతోంది.
చంద్రబాబు చాలా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని.. బుధవారం అంటే అక్టోబర్ 25వ తేదీ ఉదయం ఆయన్ని పరీక్షించిన ఐదుగురు వైద్యుల బృందం జైలు అధికారులకు ఇచ్చిన నివేదికలో విస్పష్టంగా పేర్కొన్నారు. గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు చంద్రబాబు వైద్య పరీక్షల నివేదికను నారా భువనేశ్వరికి జైలు అధికారులు పంపడంతో జైలు అధికారులు ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఉద్దేశపూర్వకంగా గోప్యత పాటిస్తున్నారని తేటతెల్లమైంది.
స్కిన్ అలర్జీతో కొన్ని రోజుల క్రితం చంద్రబాబుకు శరీరంపై దద్దుర్లు వ్యాపించి ఇబ్బంది పడడంతో.. మందులు వాడకంతోపాటు చల్లని వాతావరణం కల్పించాలని వైద్యులు సిఫార్స్ చేయడంతో.. కోర్టు ఆదేశాల మేరకు ఆయన ఉండే గదికి ఏసీని అమర్చారిన విషయం తెలిసిందే. కానీ ఆయన ఒంటిపై దద్దుర్లు తగ్గలేదని తాజా నివేదికలో వెల్లడైంది. ఇక చంద్రబాబు చెప్పిన.. వైద్యులు గుర్తించిన అంశాలపై బయట వైద్యులను సంప్రదిస్తే.. చంద్రబాబుకు.. విరోచనం సాఫీగా కాకపోవడం, ఇబ్బంది పడడం, నడుం కింద భాగంలో నొప్పి కి కారణాలు తెలుసుకోవాలంటే ప్రాక్టోస్కోపీ వంటి ప్రత్యేక వైద్య పరీక్షలు ఆయనకు నిర్వహించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
మరోవైపు జైల్లో ఆయన్ని పరీక్షించిన వైద్యులు కొన్ని వైద్య పరీక్షలను సిఫార్సు చేశారు. అలాగే పూర్తి రక్త పరీక్ష, కిడ్నీ, లివర్ పరీక్షలు, మూత్ర పరీక్ష, ఛాతీ ఎక్స్ రే, 2డి ఎకో పరీక్షలు ఆ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా జైల్లో చంద్రబాబుకు వైద్యుడు కంటిపరీక్ష నిర్వహించగా.. ఆయన కుడి కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయాల్సి ఉందని సూచించారు. ఇప్పటికే అంటే.. గతంలో ఎడమ కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేసిన విషయం తెలిసిందే. మరో కంటికి కూడా కాటరాక్ట్ ఆపరేషన్ చేయాల్సి ఉందని వైద్యుడు తెలిపారనీ, అయితే ఆ విషయాన్ని నివేదికలో పేర్కొనవద్దంటూ సదరు వైద్యుడిపై జైలు అధికారులు తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చినట్లు ఓ ప్రచారం జరుగుతోంది.
అయితే చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందంటూ జైలు అధికారులు హెల్త్ బులెటిన్ రూపంలో విడుదల చేసిన నివేదికకు.. తాజాగా నారా భువనేశ్వరికి చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వ వైద్యాధికారులు ఇచ్చిన నివేదికకు వ్యత్యాసం ఉందని.. ఇటువంటి పరిస్థితుల్లో రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు.. చంద్రబాబు ఆరోగ్యం అంతా బాగానే ఉందంటూ ఇస్తున్న నివేదికపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయని.. అలాగే ఆయన కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయాలని వైద్యుడు సూచిస్తే.. ఆ విషయాన్ని బహిర్గతం చేయవద్దంటూ ఆయనపై ఒత్తిడి ఎందుకు తీసుకు వచ్చినట్లు అనే పార్టీ శ్రేణులే కాదు, జనం సైతం ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని రహస్యంగా ఉంచి.. తప్పుడు హెల్త్ బులిటిన్ విడుదల చేసి.. ఆయనకు అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్స అందకుండా అడ్డుకోవడం వెనుక ఉన్న కుట్రకోణంపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆయన జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు కనుక.. చంద్రబాబు ఆరోగ్యంపై వైద్యులు ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయకుండా ఆయన ఆరోగ్యం బాగుందంటూ తప్పు సమాచారంతో హెల్త్ బులిటిన్ విడుదల చేసిన జైలు అధికారులపై హై కోర్టు జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.