Leading News Portal in Telugu

Minister Merugu Nagarjuna: మనం మంచి స్థితిలో ఉండాలంటే.. జగన్‌ మళ్లీ సీఎం కావాలి..


Minister Merugu Nagarjuna: మనం మంచి స్థితిలో ఉండాలంటే.. జగన్‌ మళ్లీ సీఎం కావాలి..

Minister Merugu Nagarjuna: మరోసారి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మన కులాలు మంచి స్థితిలో ఉంటాయన్నారు మంత్రి మేరుగ నాగార్జున.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జరిగిన సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు అంటూ మండిపడ్డారు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తలెత్తుకు ఉన్నారంటే మన జగన్మోహనరెడ్డే వళ్లే అన్నారు. పేదవాడు, దళితులు, మైనార్టీలు విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లేలాంటే చాలా ఇబ్బందులు పడేవారు.. వైఎస్‌ జగన్‌ వచ్చాక స్థితి గతులు పెరిగి కార్పోరేట్ వైద్యం పేదలకు అందించారని కొనియాడారు..

కానీ, విద్య ఇంగ్లీషులో పెడితే చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లి ఆపాలని చూస్తున్నారని మండిపడ్డారు నాగార్జున.. పేదవాడు ఇంగ్లీషులో మాట్లాడితే ఈ యనకు ఏమిటి ఇబ్బంది..? అని నిలదీశారు. ఈ రోజు ఎస్సీ, ఎస్టీ నా వాడే అని దైర్యంగా చెప్పగలిగే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి.. మరోసారి ఆయన సీఎం అయితేనే మన కులాలు మంచి స్థితిలో ఉంటాయన్నారు.. పెత్తందార్ల పక్షపాతి చంద్రబాబు నాయుడు అని ఆరోపించిన ఆయన.. పేదల పక్షపాతి జగన్మోహన్‌రెడ్డి అని కొనియాడారు. దళితులు ముందుకు వెళ్లాలంటే మళ్లీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సీఎం కావాలని ఆకాక్షించారు మంత్రి మేరుగ నాగార్జున. ఇక, శ్రీకాకుళం ఇచ్చాపురంలో సామాజిక సాధికార యాత్ర ముగిసింది.