Leading News Portal in Telugu

Kiran Abbavaram: ఎన్నిసార్లు ఇలా అడ్డంగా దొరికిపోతావ్ అన్నా..


Kiran Abbavaram: ఎన్నిసార్లు ఇలా అడ్డంగా దొరికిపోతావ్ అన్నా..

Kiran Abbavaram: చిత్ర పరిశ్రమలో తమ మొదటి సినిమాలోని హీరోయిన్ నే ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. ఆ లిస్ట్ లో కిరణ్ అబ్బవరం కూడా జాయిన్ అవుతున్నాడా.. ? అంటే నిజమే అంటున్నారు అభిమానులు. అవును.. ప్రతిసారి ఈవిషయంలో మాత్రం కిరణ్ అడ్డంగా బుక్ అవుతూనే ఉన్నాడు. రాజావారు రాణిగారు అనే సినిమాతో కిరణ్ టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. ఇదే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది రహస్య గోరఖ్. ఈ సినిమా వీరిద్దరికి మంచి పేరును తీసుకొచ్చి పెట్టింది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని టాక్. ఇక అప్పటినుంచి వీరిద్దరి మధ్య ప్రేమ కొనసాగుతూనే ఉంది. కానీ, వీరిద్దరూ అధికారికంగా తమ ప్రేమను అభిమానులకు చెప్పలేదు. కానీ, నెటిజన్స్ మాత్రం ఎప్పటికప్పుడు ఈ లవ్ బర్డ్స్ ను కనిపెడుతూనే ఉన్నారు. వినరో భాగ్యం విష్ణు కథ సినిమా సక్సెస్ అందుకున్నాక.. కిరణ్ వెకేషన్ వెళ్ళాడు. అది రహస్యతోనే అని కనిపెట్టారు. ఇద్దరు పోస్ట్ చేసిన ఫోటోల వెనుక బ్యాక్ డ్రాప్ ఒకటే ఉండడంతో ఈ జంట ప్రేమలో ఉన్నారని చెప్పుకొచ్చారు.

Jawan: 50 రోజులు అంటే.. మాములు విషయం కాదు బాసూ

ఇక ఈ మధ్య.. కిరణ్ ఇంటి గృహప్రవేశం వేడుకలో రహస్య పూలు గుచ్చుతూ.. ఇంటి మనిషిలా కనిపించింది. ఇలా ప్రతిసారి ఈ జంట రిలేషన్ లో ఉన్నారని రుజువు చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా మరోసారి ఈ విషయంలో దొరికిపోయాడు కిరణ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న దావత్ అనే షో లో కిరణ్ మొట్ట మొదటి గెస్ట్ గా విచ్చేశాడు. అషూ రెడ్డి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో లో రహస్య గురించి అడగగానే.. ముందు మా ఇద్దరి మధ్య ఏం లేదని.. ఏదైనా ఉంటే మేమే చెప్తామని చెప్పుకొచ్చిన కిరణ్.. ఆ తరువాత అషూ మేము అంటున్నారంటే.. ఏదో ఉంది అని అనగానే.. కిరణ్ సిగ్గుపడుతూ.. నేను ఇచ్చిన ఇన్ని ఇంటర్వ్యూలలో ఎప్పుడు ఇలా దొరికిపోలేదు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో వీరి రిలేషన్ నిజమే అని కన్ఫర్మ్ చేసినట్టే అని తెలుస్తోంది. త్వరలో ఈ జంట పెళ్లి కబురు చెప్తుందేమో చూడాలి.