
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్.. రీసెంట్ గా సిద్దూ జొన్నలగడ్డ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా ప్రాజెక్ట్ టిల్లు స్క్వేర్ తెరకెక్కుతుంది..ఇప్పటికే విడుదల చేసిన ఫన్ ట్రాక్ వీడియోతోపాటు టికెటే కొనకుండా పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది.ఇదిలా ఉంటే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించబోతున్నట్టు తెలియజేశారు మేకర్స్. డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మా టిల్లు స్క్వేర్ టీం నుంచి రేపు ఉదయం 11:07 గంటలకు మేజర్ అప్‌డేట్ అందిస్తున్నాం. వేచి ఉండండి.. అస్సలు మిస్సవద్దు.. అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. ఇంతకీ ఈ నయా అప్‌డేట్ ఏంటనేది మాత్రం సస్పెన్స్‌లో పెట్టేశారు.
సిద్దు జొన్నల గడ్డ, అనుపమ పరమేశ్వరన్ ట్యాక్సీలో రొమాంటిక్ మూడ్‌లో ఉన్న పోస్టర్ ఒకటి ఇప్పటికే నెట్టింట బాగా వైరల్ అవుతోంది. టిల్లు స్క్వేర్ నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. మేకర్స్ నుంచి రిలీజ్ డేట్‌పై క్లారిటీ రావాల్సి ఉంది.సిద్దు జొన్నల గడ్డ ఈ సారి టిల్లు స్క్వేర్ సినిమా లో టైటిల్‌కు తగ్గట్టుగా డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించబోతున్నట్టు తెలుస్తుంది.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌తో అసోసియేట్ అవుతూ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్ మరియు ప్రణీత్ రెడ్డి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.సిద్దూ జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో టిల్లు స్క్వేర్ సినిమా పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..చాలా ఏళ్ల తరువాత తన కెరీర్ లో సిద్దూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.. ఈ ఊపు లో వరుసగా ఆఫర్స్ అందుకుంటున్నాడు.. టిల్లు స్క్వేర్ తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యాడు..
https://x.com/baraju_SuperHit/status/1717546987720249791?s=20