
Malaika Arora Spotted With Black Injury Mark On Leg: బాలీవుడ్ స్టైల్ క్వీన్ మలైకా అరోరా అర్జున్ కపూర్‌తో రిలేషన్ షిప్ గురించి తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇద్దరూ తరచుగా కలిసి కనిపిస్తూ ఉండగా వారిద్దరి రొమాంటిక్ పోస్ట్‌లు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. అయితే మరోపక్క ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది, అందులో ఆమె కాలుపై గాయం అయిన గుర్తులు కనిపిస్తున్నాయి. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత, ఆమె గాయాన్ని చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నిజానికి, మలైకా అరోరా ఇటీవల ముంబైలోని ఒక సెలూన్ వెలుపల కనిపించింది. అప్పటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో మలైకా షార్ట్‌లో కనిపిస్తుండగా ఆమె తొడపై నల్లటి గాయం గుర్తు కూడా కనిపిస్తోంది.
Deepavali: ఆసక్తికరంగా ‘దీపావళి’ ట్రైలర్… నవంబర్ 11న తెలుగు, తమిళ్ లో రిలీజ్!
ఇక ఇది చూసి ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గాయం గుర్తులు నటి కుడి తొడపై కనిపిస్తున్నాయి. గాయం గుర్తులా కనిపిస్తున్న ఈ నల్లటి గుర్తును కూడా ఆమె దాచిపపెట్టే ప్రయత్నం చేసిన వీడియోలో మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మలైకా కాలుపై గాయం గుర్తులను చూసి జనాలు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. అయితే, నటి వైపు నుండి ఈ గాయం గురించి ఎటువంటి స్పందన రాలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ గుర్తు గురించి తెలియాలంటే మలైకా రియాక్షన్ కోసం వేచి చూడాల్సిందే. ఇక మలైకా అరోరా ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుల గురించి మాట్లాడాలంటే ఆమె ఇప్పుడు సినిమాల కంటే టీవీ రియాలిటీ షోలలో జడ్జిగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆమె సోనీ టీవీ ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఝలక్ దిఖ్లా జా’ యొక్క కొత్త సీజన్‌కు న్యాయనిర్ణేతగా కనిపించబోతోంది.