Leading News Portal in Telugu

Minister Ambati Rambabu: అంబటి రాంబాబుపై దాడికి యత్నం.. సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి..


Minister Ambati Rambabu: అంబటి రాంబాబుపై దాడికి యత్నం.. సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి..

Minister Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబును ఖమ్మంలో అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించారు.. అయితే, ఈ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నన్ను భౌతికంగా లేకుండా చేస్తే రూ. 50 లక్షల బహుమానం ఇస్తామని అప్పుడు ప్రకటించారు.. ఇవాళ భౌతికంగా నా పై దాడి చేయటానికే వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.. నిన్న రాత్రి జరిగిన యాక్సిడెంట్ కు, ఈ దాడికి మధ్య సంబంధం ఉందేమో అన్న అనుమానం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఒక నిశ్చితార్థం కోసం నిన్న ఖమ్మం వెళ్లాను.. వరుసగా రెండు సంఘటనలు జరిగాయి.. ఇవాళ ఉదయం నేను బస చేసిన హోటల్ దగ్గర కొంత మంది నాపై దౌర్జన్యం చేశారు.. టీడీపీగా చెప్పుకుంటున్న కొంత మంది కర్రలతో వచ్చారు.. నేను వ్యక్తిగత కార్యక్రమంపై వెళ్లాను.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు.. ఏయ్.. అంబటి రాంబాబు నిన్ను వేసేస్తాం అని అరిచారు అంటూ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చారు.

హఠాత్తుగా జరిగిన ఈ సంఘటన చూసి తాను ఆశ్చర్య పోయాను అన్నారు మంత్రి అంబటి రాంబాబు.. గత ఏడాది కూడా ఒక సామాజిక వర్గ సమావేశంలో ఇలా అనుచిత వ్యాఖ్యలు చేశారు.. నన్ను భౌతికంగా లేకుండా చేస్తే 50 లక్షల బహుమానం ఇస్తామని అప్పుడు ప్రకటించారు, ఇవాళ భౌతికంగా నా పై దాడి చేయటానికే వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ సంఘటనలో కొంతమందిని ఖమ్మం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆరుగురూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లు అని తెలిపారు.. అయితే, ఏమిటి ఈ కులోన్మాదం? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కులోన్మాదంతోనే వంగవీటి రంగాను నడిరోడ్డు పై హత్య చేశారని గుర్తుచేశారు.

ఇక, చంద్రబాబు తప్పు చేయబట్టే ఊచలు లెక్క పెడుతున్నారన్నారు అంబటి రాంబాబు.. దాడులతో నన్ను బెదిరించ లేరన్న ఆయన.. కులోన్మాదానికి రోజులు పోయాయన్నారు. నిన్న రాత్రి జరిగిన యాక్సిడెంట్ కు, ఈ దాడికి మధ్య సంబంధం ఉందేమో అంటూ అనుమానాన్ని వ్యక్తం చేశారు. నా వాహనంపై లారీ మీద నుంచి రెండు బస్తాలు పడ్డాయి అని రాత్రి జరిగిన ప్రమాదంపై వివరాలు వెల్లడించారు. ఇక, ఖమ్మం పోలీసులు సుమోటోగా కేసు బుక్ చేశారని తెలిపారు. అంటే ఘాటుగా మాట్లాడితే లేపేస్తారా? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి అంబటి రాంబాబు.