Leading News Portal in Telugu

Varun Sandesh: ‘చిత్రం చూడర’ అంటున్న వరుణ్ సందేశ్.. ఈసారైనా?


Varun Sandesh: ‘చిత్రం చూడర’ అంటున్న వరుణ్ సందేశ్.. ఈసారైనా?

Chitram Choodara Teaser: సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న హీరో వరుణ్ సందేశ్ ప్రస్తుతం ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వంలో ధనరాజ్, కాశీ విశ్వనాథ్ ఇతర ప్రధాన పాత్రల్లో సస్పెన్స్ థ్రిల్లర్ ‘చిత్రం చూడర’ చేస్తున్నారు. బిఎమ్ సినిమాస్ బ్యానర్‌పై శేషు మారం రెడ్డి, బోయపాటి బాగ్యలక్ష్మి నిర్మిస్తున్న ఈ సినిమాలో శీతల్ భట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమంలో ప్రమోషన్స్ మొదలు పెట్టారు. స్టార్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేయగా అది ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంటి గోడపై కూర్చున్న వరుణ్ సందేశ్, ధనరాజ్, కాశీ విశ్వనాథ్‌ల సస్పెన్స్ ఫేస్ లని ప్రజెంట్ చేయడంతో టీజర్ ప్రారంభమవుతుండగా వరుణ్ సందేశ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమానిగా కనిపించారు.

Kiran Abbavaram: లియో సినిమాలో కిరణ్ అబ్బవరం… ఎవరైనా గమనించారా?

వరుణ్ క్రైమ్‌లో ధన్‌రాజ్, కాశీ విశ్వనాథ్ భాగస్వాములు అని చెబుతూనే కోర్ పాయింట్‌ను రివిల్ చేయకుండానే టీజర్ సస్పెన్స్, యాక్షన్ అంశాలతో ఆకట్టుకునేలా కట్ చేశారు. ఈ సినిమాకి రధన్ సంగీతం అందిస్తుండగా, జవహర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. అల్లరి రవిబాబు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, శివాజీ రాజా, మీనా కుమారి, అన్నపూర్ణమ్మ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాలో నేనింతే ఫేమ్ అదితి గౌతమ్ ఓ ప్రత్యేక పాత్రలో అలరించనుంది. వీరు కాకుండా రచ్చ రవి, కెఎ పాల్ రాము, పింగ్ పాంగ్ సూర్య, రైజింగ్ రాజు తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.