
భారతీయ అతి పెద్ద భీమా కంపెనీ ఎల్‌ఐసీ తన కస్టమర్లకు అదిరిపోయే లాభాలను అందించే స్కీమ్ లను అందిస్తుంది.. ఎల్‌ఐసీ అందిస్తున్న స్కీమ్ లలో ఒకటి సరళ్ ప్లాన్ కూడా ఒకటి.. ఈ ప్లాన్ లో డబ్బులను పెట్టుబడి పెడితే అధిక లాభాలను పొందవచ్చు.. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
ఈ కొత్త పెన్షన్ స్కీమ్ అంటే సరళ్ పెన్షన్‌తో ముందుకు వచ్చింది. ఇందులో పాలసీదారులు ఒకసారి ప్రీమియం చెల్లించడం ద్వారా జీవితాంతం పెన్షన్ పొందవచ్చు. అయితే ఈ పెన్షన్ పొందడానికి రెండు ఎంపికలు ఉన్నాయి. ఒకటి జీవితాంతం పింఛను పొందేందుకు ఉండగా మరొకటి చివరిగా జీవించి ఉన్న వ్యక్తి మరణించినప్పుడు కొనుగోలు చేసిన ధరలో 100 శాతం లాభాన్ని పొందవచ్చు.. ఈ మొదటి ఆప్షన్‌లో పాలసీదారు జీవించి ఉన్నంత వరకు యాన్యుటీ చెల్లింపులు బకాయిల్లోనే చేస్తారు. వ్యక్తి మరణించినప్పుడు యాన్యుటీ చెల్లింపులు వెంటనే ఆగిపోతాయి. అలాగే నామినీకి మొత్తం డబ్బులను చెల్లిస్తారు..
అలాగే రెండొవ ఎంపికలో వ్యక్తి లేదా జీవిత భాగస్వామి జీవించి ఉన్నంత వరకు యాన్యుటీ మొత్తం బకాయిల్లో చెల్లిస్తారు. అయితే ఈ జాయింట్ లైఫ్ యాన్యుటీని జీవిత భాగస్వామితో మాత్రమే పూర్తిగా చెల్లిస్తారు.. ఇక ఈ పాలసీని కొనుగోలు చెయ్యాలనుకొనేవారికి వయస్సు 40 ఏళ్లు ఉండాలి.. గరిష్టంగా 80 ఏళ్లు ఉండాలి.. కాగా,సరళ్ పెన్షన్ కింద అందుబాటులో ఉన్న యాన్యుటీని భవిష్యత్తులో నెలవారీ, త్రైమాసికం లేదా వార్షికంగా చెల్లించవచ్చు. ఎల్‌ఐసి తన పాలసీ డాక్యుమెంట్‌లో పాలసీ ప్రారంభంలో యాన్యుటీ రేట్లు హామీ ఇస్తాయి.. ఉదాహరణకు 60 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టి, వార్షిక యాన్యుటీ మోడ్‌ను ఎంచుకుంటే అతనికి రూ.58,950 లభిస్తుంది. అయితే ఈ చెల్లింపులు వివిధ షరత్తులకు లోబడి ఉంటాయి.. ఈ పాలసీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఆఫీస్ వెళ్లి కనుక్కోవచ్చు.. లేదా ఆన్ లైన్ లో చూడవచ్చు..