
Jyothi Raj: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజురోజుకు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఏ సీజన్ కు లేని ఆసక్తి.. ఈ సీజన్ తెప్పించింది. ఎంత చిరాకు తెప్పించినా.. అంతే ఆసక్తిని తెప్పిస్తోంది. మొట్ట మొదటిసారి బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్స్ కోసం.. వారి ఇంట్లో వారిని సోషల్ మీడియాలో బ్యాడ్ చేయడం. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటూ కొంతమంది అతనికి సపోర్ట్ చేయడమే కాకుండా అమర్ దీప్, సందీప్ కుటుంబ సభ్యులను మాటలతో వేధిస్తున్నారు. ఇక ఈ మధ్యనే అమర్ దీప్ తల్లి.. ఒక వీడియోను రిలీజ్ చేసింది. పల్లవి ప్రశాంత్ అభిమానులు అని చెప్పుకుంటూ.. అమర్ తల్లిని, భార్యను ఇష్టమొచ్చినట్లు.. అసభ్యకరంగా తిడుతున్నారు. దీంతో ఆమె ఎమోషనల్ అవుతూ .. ఇది పద్దతి కాదని, అభిమానం ఉండొచ్చు కానీ, కుటుంబాలను అసభ్యకరంగా తిట్టడం సభ్యత కాదని చెప్పుకొచ్చింది. అయితే ప్రశాంత్ ఫ్యాన్స్.. సందీప్ కుటుంబాన్ని కూడా వదలలేదు. ఈ విషయాన్ని సందీప్ భార్య జ్యోతి రాజ్.. ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
Dil Raju: దిల్ రాజు ఇంట పెళ్లి సందడి..
“రియాలిటీ షో సందీప్ కు ఏమి కొత్తకాదు. ఆయన అన్నింటిలోనూ విజయాన్ని అందుకుంటాడు. ఒక్కసారి దిగారంటే కప్పు కొట్టాల్సిందే. బిగ్ బాస్ అనేది ఒక కొత్త అనుభవం. డ్యాన్స్ వేరు. రియాలిటీ షో వేరు. సందీప్ ఎవరితోనైనా కలవడానికి కాస్తా టైం తీసుకుంటారు. అతను ఇంట్రోవర్ట్. హౌస్‌లో ఇంతమందిలో కలవాలంటే కాస్తా సమయం పడుతుంది. ఆయన బిగ్ బాస్ కు వెళ్ళడానికి ఒక కారణం ఉంది.. మా డ్రీమ్ ను నెరవేర్చడానికి మాత్రమే ఆయన హౌస్ కు వెళ్లాడు. నేను సందీప్ వీడియోలు పోస్ట్ చేసిన ప్రతిసారి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అసభ్యకరమైన కామెంట్స్ పెడుతూ వేధిస్తున్నారు. నీ మొగుడు వేస్ట్.. ప్రశాంత్‌తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ప్రశాంత్ జోలికొస్తే మిమ్మల్ని వదలం. నీ మొగుడికి చెప్పు.. ప్రశాంత్ జోలికి రావొద్దని. ఇంకా కొన్ని మాటలైతే నేను చెప్పలేనంత అసభ్యంగా మాట్లాడారు. దీనివలన ఎవరికి బ్యాడ్.. ప్రశాంత్ కు కాదా.. ? అతను లోపలి వెళ్ళేటప్పుడు నాకు సపోర్ట్ చేయమని చెప్పి వెళ్ళాడు. ఈ ఫ్యాన్స్ వలన అతడికి బ్యాడ్ నేమ్ తప్ప మంచి ఏమి జరగదు ” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సీజన్ లో సందీప్ ఎన్ని రోజులు ఉంటాడో చూడాలి.