
Yogesh Kadyan: చదువుకుంటూ సరదాగా గడపాల్సిన వయసులో అంతర్జాతీయ క్రిమినల్ గా ముద్రవేసుకున్నాడు. తెలిసి తెలియని వయసులో వేసిన తప్పటడుగు ఉన్న ఊరిని వదిలి పోయేలా చేసింది. సప్త సముద్రాలు ధాటి ఇతర దేశాలలో భయంభయంగా బ్రతకాల్సి వచ్చింది. కేవలం 19 ఏళ్లకే ఏకంగా అంతర్జాతీయ క్రిమినల్ పోలీసింగ్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు వచ్చాయి అంటే ఆ యువకుడు ఎంతటి నేర చరిత్ర కలిగి ఉన్నాడో అర్థంచేసుకోవచ్చు. వివరాలలోకి వెళ్తే.. హర్యానా లోని ఝజ్జర్‌లో యోగేష్ కడయాన్ అనే యువకుడు 19 సంవత్సరాలకే గ్యాంగ్‌స్టర్ గా ముద్రవేసుకున్నాడు. ప్రసార మాధ్యమాల సమాచారం ప్రకారం.. యోగేష్‌పై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ఆయుధాల చట్టం ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇతని పైన ఇంటర్‌పోల్ (అంతర్జాతీయ క్రిమినల్ పోలీసింగ్) రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. అయితే గత కొంత కాలంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) టెర్రరిస్ట్ నెట్‌వర్క్‌పైన ద్రుష్టి సారిస్తూ కఠిన చర్యలను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో చాలామంది గ్యాంగ్‌స్టర్లు దేశం విడిచి పారిపోయారు. ఈ క్రమంలో యోగేష్ కూడా నకిలీ పాస్పోర్ట్ తో దేశం ధాటి ఉంటాడని అందరు అభిప్రాయ పడుతున్నారు.
Read also:World Cup 2023: ప్రపంచకప్ చరిత్రలోనే ఆసీస్ జట్టు రికార్డ్.. వరుసగా మూడోసారి 350కి పైగా స్కోర్
కాగా యోగేష్ 19 ఏళ్లకే అన్ని రకాల ఆయుధాలను ఉపయోగించడంలో ఆరితేరినట్టు సమాచారం. రెడ్ కార్నర్ నోటీసుల సమాచారం ప్రకారం.. యోగేష్ ఎత్తు 1.72 మీటర్లు కాగా 70 కేజీల బరువు ఉంటాడు. కళ్ళు, జుట్టు నల్లగా ఉంటాయి. ఎడమ చేతిపై పుట్టుమచ్చ కూడా ఉంది. యోగేష్ హర్యానా గ్యాంగ్‌స్టర్ హిమాన్షు భౌకి చాలా సన్నిహితుడని సమాచారం. కాగా 2020లో జువైనల్ హోమ్ నుంచి పరారైన హిమాన్షు భౌ ఇప్పటి దర్యాప్తు ఏజెన్సీలకి పట్టుబడలేదు. కాగా అతను అమెరికాలో ఉన్నట్లు కొందరి అభిప్రాయం. ప్రస్తుతం యోగేష్ కూడా హిమాన్షు భౌ చెంతకే చేరి ఉంటాడని పలువురు అభిప్రయం వ్యక్తం చేస్తున్నారు.