
Nellore: రోజు రోజుకి మనిషి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్నాడు. మంచి చెడులకు మధ్య వ్యత్యాసాన్ని విస్మరించి మృగంలా మారుతున్నాడు. శారీరక వాంఛలతో దారుణాలకు ఒడిగడుతున్నాడు. క్షణకాల సుఖం కోసం జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా ఎదుటి వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు కొందరు మానవ మృగాలు. వావివరసలు మర్చిపోతున్నారు అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. వదిన అంటే అమ్మ తరువాత అమ్మలాంటిది అంటారు. అందుకే అన్న భార్యను వదినమ్మ అని పిలుస్తారు. అయితే అలాంటి వదిన పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ మూర్ఖుడు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
Read also:Blockade of the Gaza: భూతల యుద్ధానికి దిగిన ఇజ్రాయెల్.. గాజాలో ఇంటర్నెట్ కట్
వివరాలలోకి వెళ్తే.. S.P.S.R నెల్లూరు జిల్లా లోని పొదలకూరు మండలం అంకుపల్లి గ్రామంలో ఓ వ్యక్తి ఇంకిత జ్ఞానం లేకుండా విచక్షణారహితంగా సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. తల్లి లాంటి వదిన పైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనితో బాధితురాలు గ్రామ సచివాలయం లోని మహిళా పోలీసును ఆశ్రయించింది. జరిగిన దారుణాన్ని మహిళా పోలీసుకి విన్నవించుకుని దారుణానికి పాల్పడ్డ మరిది పైన ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బాధితురాలు మహిళా పోలీసుతో మాట్లాడుతూ ఇంట్లో ఎవరు లేని సమయంలో అతను ఈ దారుణానికి పాలపడ్డట్లు తెలిపింది. దీనితో ఈ వార్త వెలుగు చూసింది. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటన గురించి విచారణ చేస్తున్నారు.