Leading News Portal in Telugu

Rashmika Mandanna: నేను చాలా మిస్ అవుతున్న.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసిన రష్మిక..


Rashmika Mandanna: నేను చాలా మిస్ అవుతున్న.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసిన రష్మిక..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిన ఈ అమ్మడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. తెలుగులోనే కాదు బాలివుడ్ లో కూడా వరుస సినిమాలను చేస్తుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన గురించి అభిమానులకు షేర్ చేస్తుంది.. తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఆసక్తికర పోస్ట్ చేసింది.. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది..

ఆ పోస్ట్ లో ప్రస్తుతం తను ట్రావెలింగ్ చాలా మిస్ అవుతున్నానంటూ చెప్పుకొచ్చింది. నేను ప్రయాణాన్ని చాలా మిస్ అవుతున్నాను. ప్రయాణం చేసే అబ్బాయిల గురించి ఒక చిన్న విషయం. ఎప్పుడైనా మీకు కొంత సమయం దొరికితే ప్రయాణం నిర్ధారించుకోండి. ఎక్కడికైనా, ఇలా .. మీ స్వస్థలానికి లేదా మీ స్నేహితుల ఇళ్లకు లేదా మీ కలల గమ్యస్థానానికి లేదా కుటుంబంతో లేదా ఒంటరిగా ఎక్కడైనా.. ఏదైనా కానీ ఎక్కడైనా సురక్షితంగా. ఎందుకంటే ప్రయాణం మీ జ్ఞానాన్ని, మనస్సును ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.. ఈ ట్రావెల్ లో ప్రతిది గొప్ప అనుభూతి చాలా మిస్ అవుతున్నాను అంటూ రాసుకొచ్చింది.. అదే ఇప్పుడు వైరల్ అవుతుంది..

ఇక సినిమాల విషయానికొస్తే.. పుష్ప 2 చిత్రంలో నటిస్తుంది. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప చిత్రానికి సెకండ్ పార్ట్ ఈ చిత్రం . ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా.. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. చాలా రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా తోపాటు.. విజయ్ దేవరకొండతో మళ్లీ జత కట్టనుంది. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తోన్న కొత్త ప్రాజెక్టులో రష్మిక మెయిన్ లీడ్. ఈ విషయంపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది.. ఇవే కాకుండా మరికొన్ని సినిమాల్లో నటిస్తుంది..