Leading News Portal in Telugu

Winter Season : చలికాలంలో రోగాల బారిన పడకుండా ఉండాలంటే.. వీటిని రోజూ తీసుకోవాలి..


Winter Season : చలికాలంలో రోగాల బారిన పడకుండా ఉండాలంటే.. వీటిని రోజూ తీసుకోవాలి..

చలికాలం వచ్చేసింది.. వర్షాకాలంలోనే కాదు ఈ కాలంలో కూడా జబ్బులు వస్తూనే ఉంటాయి.. వాటి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవాలి.. అయితే ఈ రోగాల నుంచి బయటపడాలంటే హెల్తీ ఆహారాన్ని కూడా తీసుకోవాలి.. చలికాలంలో తీసుకోవాల్సిన ఆహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

డ్రైఫ్రైట్స్ లో ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. చలి కాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి..

మసాలా దినుసులు.. వీటిని తీసుకువడం వల్ల ఎన్నో రోగాలు నయం అవుతాయని నిపుణులు చెబుతున్నారు..

ఆకు కూరల్లో విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు ఇలా అనేక పోషకాలు ఉంటాయి. కాబట్టి చలి కాలంలో ఆకు కూరలు తినడం వల్ల బాడీ స్ట్రాంగ్ గా తయారువుతుంది. ఇన్ ఫెక్షన్లు బారిన పడే అవకాశం తగ్గుతుంది..

ఈ కాలం వచ్చేసరికి బద్ధకంగా, చల్లగా ఉంటుంది. ఎలాంటి పనులు చేయాలనిపించదు. దీంతో ఈజీగా బరువు పెరిగే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి చలి కాలంలో ఎక్సర్ సైజ్ లు, వాకింగ్ వంటివి చేస్తే చాలా మంచిది.. రోగ నిరోధక శక్తి కూడా భారీగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు..

సూప్స్ గురించి అందరికీ తెలుసు. సాధారణంగా రెస్టారెంట్స్, హోటల్స్ కు వెళ్లినప్పుడు ఆహారం తినకు ముందు వీటిని తీసుకుంటూరు. సూప్స్ లో ఎన్నో రకాలు ఉంటాయి. వీటిల్లో మీ టేస్ట్ కి తగిన విధంగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుని ఇవి చలి నుంచి కాపాడుతాయి.. ఇవన్నీ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు..