
1 Dead and 20 Injured in Bamb Blasts At Kerala: కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో మూడు చోట్ల పేలుళ్లు సంభవించాయి. ఆదివారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా.. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కలమస్సేరిలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో అక్కడ దాదాపుగా 2 వేల మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక అంచనా ప్రకారం దీన్ని ఉగ్రదాడిగా పోలీసులు భావిస్తున్నారు. బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తోంది. ఉదయం 10 గంటల తర్వాత ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.