
Odisha: మనలో చాల మంది నిత్యం ఏదో ఒక చోటుకి ప్రయాణిస్తుంటారు. అయితే ప్రయాణికుల్ని సురక్షితంగా గమ్య స్థానానికి చేర్చాల్సిన బాధ్యత ఆ వాహనాన్ని నడిపే డ్రైవ్ పైనే ఉంటుంది. కొన్ని సార్లు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలను పణంగాపెట్టి ప్రయాణికుల్ని కాపాడుతుంటారు డ్రైవర్ లు. అయితే తాజాగా ఓ బస్సు డ్రైవర్ తను చనిపోతూ కూడా బస్సు లోని ప్రయాణికుల్ని రక్షించాడు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. సనా ప్రధాన్ అనే వ్యక్తి ఒడిశాలో బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలానే విధులకు వచ్చిన డ్రైవర్ 48 మంది ప్రయాణికుల్ని బస్సులో ఎక్కించుకుని భువనేశ్వర్ నగరానికి బయలు దేరాడు. కాగా బస్సు కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఉన్నటుండి డ్రైవర్ కి గుండెపోటు వచ్చింది.
Read also:Hyderabad: చంపాపేట్ స్వప్న హత్య కేసులో ట్విస్ట్.. బయటపడిన సంచలన నిజాలు
ఈ నేపథ్యంలో డ్రైవర్ ప్రయాణికుల గురించి ఆలోచించాడు.. బస్సు వేగాన్ని తగ్గించి బస్సును సమీపం లోని గోడ వైపుకి మళ్లించి గోడను డీ కొట్టాడు. దీనితో బస్సు ఆగిపోయింది. కాగా డ్రైవర్ గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ నేపథ్యంలో క్షేమంగా బయటపడిన బస్సు లోని ప్రయాణికులు మాట్లాడుతూ.. డ్రైవర్ బస్సును నడుపుతున్నప్పడు అతనికి గుండె నొప్పి వచ్చింది. కనీసం స్టీరింగ్ ని నియంత్రిచడం కూడా కష్టంగా ఉన్న ప్రయాణికుల ప్రాణాలను రక్షించాలని తన తుది శ్వాస వరకు ప్రయత్నించాడు. మా ప్రాణాలను రక్షించి అతను ప్రాణాలను వదిలాడు అని తెలిపారు. కాగా ఈ ఘటన కంధమాల్ జిల్లా లోని పబురియా గ్రామ సమీపంలో రాత్రి జరిగిందని ప్రయాణికులు పేర్కొన్నారు.