
Telangana elections: ఎల్లారెడ్డి నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. వివరాల లోకి వెళ్తే.. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ మాట్లాడుతూ.. తనకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియ చేసారు. అలానే గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన సురేందర్ పార్టీకి ద్రోహం చేశాడు అని పేర్కొన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని వెల్లడించిన ఆయన.. డబుల్ బెడ్ రూం అంశంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారు అని ఆరోపించారు.
Read alsoRevanth Reddy: సీఎం కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్
ఎల్లారెడ్డి నియోజక వర్గంలోప్రజలు, రైతులు తాగునీరు సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. నియోజక వర్గంలో కనీసం తాగునీటి, సాగునీటి వసతులు లేకపోవడం నిజంగా బాధాకరం అని పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాల్లో స్థానిక ఎమ్మెల్యే సురేందర్ ఫెయిల్ అయ్యారు అని ఆరోపించిన మదన్ మోహన్.. తన ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు సేవ సేవలు అందించానని.. ఇప్పుడు ప్రజలు ఆశీర్వదిస్తే మరింత సేవలు అందిస్తానని తెలిపారు. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ రాష్టం లోనే అత్యధిక మెజార్టీతో గెలువబోతుందని హర్షం వ్యక్తం చేశారు.