
Health: ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడమే కాదు.. తీసుకునే ఆహారాన్ని సరైన పద్దతిలో తీసుకోవాలి.. లేకపోతే ఆ ఆహారం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం పక్కన పెడితే అనారోగ్యం భారిన పడడం ఖాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా పప్పు ని వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పూర్తి పోషకాలను శరీరానికి అందించవచ్చు. మనం నిత్య జీవితంలో చాల రకాల పప్పులను ఉపయోగిస్తుంటాము. వారంలో కనీసం రెండు రోజులైనా పప్పు కూర తప్పకుండ ఉంటుంది. మాంసాహారులకు చికెన్, మటన్ వంటి వాటి నుండి ప్రోటీన్లు లభిస్తాయి. కానీ శాకాహారులకు ప్రోటీన్ ను అందించే ఆహారం పప్పు దినుసులు మాత్రమే.
Read also:T.Congress: ఎన్నికల ముందు కాంగ్రెస్కు బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా
పెసరపప్పు, కందిపప్పు వంటి ఏ పప్పును వండాలి అనుకున్న మొదట ఆ పప్పును కనీసం ఒక గంట సేపైన నానబెట్టాలి. ఆ తరువాతనే వాడుకోవాలి అని ఆయుర్వేదము సూచిస్తుంది. ఆలా కాకుండా డైరెక్ట్ గా పప్పును ఉడకబెడితే అందులోని అన్ని పోషకాలు శరీరానికి అందవు. అలానే అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలానే పప్పు పాడవకుండా ఉపయోగించే పౌడర్లు కూడా ఇలా నానబెట్టడం వల్ల నీళ్ళలోకి పూర్తిగా దిగిపోతాయి. ఆ తరువాత రెండు మూడు సార్లు కడగడం వల్ల హానికారక రసాయనాలను నియత్రించవచ్చు. అంతే కాకుండా పప్పును నానబెట్టి వండడం వల్ల పప్పు మృదువుగా అవుతుంది. రుచి గా ఉంటుంది. పైగా త్వరగా ఉడుకుతుంది. దీని వల్ల సమయం తో పాటుగా గ్యాస్ కూడా ఆదా అవుతుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
NOTE: ఇంటర్నెట్ లో దొరికిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము.. ప్రయత్నించేముందు.. సంబంధిత నిపుణుల సలహాలు పాటించగలరని మనవి.. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీ తెలుగు. కామ్ బాధ్యత వహించదు..