
MLA Laxma Reddy: జడ్చర్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రచార జోరును పెంచారు. తన నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ.. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అందులో భాగంగానే మసిగుండ్లపల్లి గ్రామానికి చెందిన కొందరు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.
గత పదేళ్ళలో మసిగుండ్లపల్లి గ్రామం చాలా మారిందని.. రోడ్డు, డ్రైనేజీలతో పాటు గ్రామం అభివృద్ధి చెందిందని పార్టీ మారిన నాయకులు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పథకాలకు అభివృద్ధికి ఆకర్షితులయ్యే పార్టీలో చేరుతున్నట్లు మసిగుండ్లపల్లి గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. తమ గ్రామంతో పాటు, నియోజకవర్గం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని.. ఇంతటి అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని బీఆర్ఎస్ లో చేరినట్లు వారు చెప్పారు. రానున్న ఎన్నికల్లో లక్ష్మారెడ్డికి లక్ష మెజార్టీ అందించే దిశగా ప్రతి ఒక్కరం కృషి చేస్తామని పేర్కొన్నారు.