Leading News Portal in Telugu

Suriya: ఢిల్లీ ఎప్పుడు వస్తాడో.. రోలెక్స్ కూడా తిరిగి వస్తాడు


Suriya: ఢిల్లీ ఎప్పుడు వస్తాడో.. రోలెక్స్ కూడా తిరిగి వస్తాడు

Suriya: కోలీవుడ్ లో స్టార్ హీరోస్ గా కొనసాగుతున్న బ్రదర్స్ సూర్య మరియు కార్తీ. వరుస సినిమాలను రిలీజ్ చేస్తూ మంచి మంచి హిట్లును అందుకుంటున్నారు. ఇక సూర్య ప్రస్తుతం కంగువ సినిమాలో నటిస్తున్నాడు. ఇది కాకుండా ఈ మధ్యనే సుధా కొంగర దర్శకత్వంలో మరోసారి నటిస్తున్నాడు. ఇంకోపక్క కార్తీ.. జపాన్ సినిమాలో నటిస్తున్నాడు. తెలుగులో ఈ అమ్మదమ్ములకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక జపాన్ సినిమాను రాజు మురగన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ శనివారం జపాన్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు సూర్య ముఖ్య అతిధిగా విచ్చేశాడు. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో ఈ ఇద్దరు అన్నదమ్ములు నటించి మెప్పించారు. ఖైదీలో ఢిల్లీగా కార్తీ కనిపించగా.. విక్రమ్ లో రోలెక్స్ లా సూర్య నట విశ్వరూపం చూపించాడు. ఇక ఢిల్లీ, రోలెక్స్ కలిసి ఎప్పుడు కనిపిస్తారా.. ? అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఆ విషయాన్నీ సూర్య ఈ వెంత్ లో చెప్పి షాక్ ఇచ్చాడు.

Mega Family: పిక్ ఆఫ్ ది డే.. కన్నుల పండుగగా ఉందే

“జపాన్ ట్రైలర్ నాకు బాగా నచ్చింది. కార్తీ నటించిన 25 వ చిత్రం. నాకు సింగం ఎలా పేరు తెచ్చి పెట్టిందో.. కార్తీకి జపాన్ అలాగే పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇక నా నెక్స్ట్ సినిమా కంగువ కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో నాకు తెలుస్తుంది. ఈ సినిమా మీ అందరికీ నచ్చేలానే ఉంటుంది. సినిమా అద్భుతంగా సిద్ధమవుతోంది. అభిమానులు తప్పకుండా సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఇక సూర్య కన్నా రోలెక్స్ గానే ఎక్కువ చూస్తున్నారు నన్ను. రోలెక్స్ పాత్ర నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. రోలెక్స్, ఢిల్లీ ఎప్పుడు కలుస్తారు అని అడుగుతున్నారు. ఢిల్లీ ఎప్పుడు వస్తాడో.. రోలెక్స్ అప్పుడు ఖచ్చితంగా తిరిగి వస్తాడు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అంటే ఖైదీ 2 లో ఢిల్లీ, రోలెక్స్ ల మధ్య యుద్ధం ఉంటుంది అని సూర్య చెప్పకనే చెప్పాడు. దీంతో అభిమానులు ఖైదీ 2 కోసం ఎదురుచూస్తున్నామని చెప్పుకొస్తున్నారు.