Leading News Portal in Telugu

Ramireddy Pratap: చంద్రబాబు, లోకేష్ పై ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ తీవ్ర వ్యాఖ్యలు


Ramireddy Pratap: చంద్రబాబు, లోకేష్ పై ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ తీవ్ర వ్యాఖ్యలు

చంద్రబాబు, లోకేష్ పై వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కావలి పట్టణంలో ఒక బస్సు డ్రైవర్ ని కొంతమంది రౌడీ మూకలు కొట్టారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ఘటనకు పప్పు(లోకేశ్), దత్తపుత్రుడు (పవన్ కల్యాణ్) రాజకీయ రంగు పులిమారని ఆరోపించారు. ఆ రౌడీ ముఠాను ఎదిరించినందుకు తన కారు పై కూడా గతంలో దాడి చేశారని అన్నారు. రాష్ట్రంలో ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా ముఖ్యమంత్రికి ఆపాదిస్తుంటారని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ తెలిపారు. బస్సు డ్రైవర్ ను కొట్టింది వైసీపీ కార్యకర్త కాదు.. రౌడీ మూకలు అని కావలి ప్రజలు అందరికీ తెలుసన్నారు. ఈ దాడికి పాల్పడిన వారు అందరూ టీడీపీ, జనసేనకు సంబంధించిన వ్యక్తులేనని తెలిపారు. కావలి నియోజకవర్గంలో రౌడీయిజాన్ని సహించమని.. ప్రాణాలు పోయినా పర్వాలేదు…ఐ డోంట్ కేర్ అన్నారు. ఈ గొడవలో వైసీపీ వాళ్ళు ఉన్నారని నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

మరోవైపు.. భువనేశ్వరి నిజం గెలవాలి అంటుంటే.. లోకేష్ వైఖరి నిజం దాయాలి అన్నట్లు ఉందని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ ఎద్దేవా చేశారు. యువగళం యాత్ర పేరుతో లోకేష్ కావలిలో అడుగు పెట్టిన తర్వాత కావలిలోని చెరువులన్నీ ఎండిపోయాయని విమర్శించారు. లోకేష్ రాకముందు కావలిలో చెరువులన్నీ నీళ్ళతో నిండి ఉండేవని అన్నారు. లోకేశ్ తనను అనకొండ అన్నాడని… ఇప్పుడు వాళ్ళబ్బ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడని ఆరోపించారు. 50 రోజుల సినిమా అయ్యింది…ఇంకా వంద రోజుల ఆట ఆడాల్సి ఉందని అన్నారు. క్రికెట్ భాషలో హాఫ్ సెంచరీ అయ్యిందని విమర్శించారు. లోకేష్ ను కొడాలి నాని ఊరకనే తిట్టడం లేదని.. ముందు ప్రిపేర్ అయి మాట్లాడాలని హితవు పలికారు.