Leading News Portal in Telugu

Kerala Bomb Blast: “వారి బోధనలు జాతి వ్యతిరేకంగా ఉన్నాయి”.. అందుకే బాంబులు పెట్టా..


Kerala Bomb Blast: “వారి బోధనలు జాతి వ్యతిరేకంగా ఉన్నాయి”.. అందుకే బాంబులు పెట్టా..

Kerala Bomb Blast: కేరళలోని కలమస్సేరిలో ‘యొహోవా విట్‌నెసెస్’ క్రైస్తవ సమూహం ప్రార్థనల సమయంలో వరసగా మూడు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ చర్యలో ఏదైనా ఉగ్రవాద కోణం ఉందా..? అని ఇప్పటికే ఎన్ఐఏ విచారణ జరుపుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒకరు మరణించగా.. 45 మంది గాయపడ్డారు. నిమిషాల వ్యవధిలోనే మూడు పేలుళ్లు జరగాయని, పేలుళ్లలో ఐఈడీని టిఫిన్ బాక్సుల్లో అమర్చినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే ఈ పేలుళ్లకు తానే బాధ్యుడిననని డోమినిక్ మార్టిన్ అనే 48 ఏళ్ల వ్యక్తి త్రిసూర్ లోని కొకద్ర పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ప్రస్తుతం అతన్ని కేరళ పోలీసులు విచారిస్తున్నారు. విచారణ సమయమంలో తన వద్ద ఉన్న సాక్ష్యాలను కూడా అందించారని పోలీసులు వెల్లడించారు.

యొహోవా విట్‌నెసెస్ బోధనలను ‘విద్రోహపూరితమైనవి’ ఉన్నాయని అతను ఆరోపించాడు. కాబట్టే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మార్టిన్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను పంచుకున్నాడు. గత 16 ఏళ్లుగా తాను యొహోవా విట్‌నెసెస్ సమూహంలో సభ్యుడిగా ఉన్నానని, తాను యొహోవా విట్‌నెసెస్ బోధనలతో ఏకీభవించడం లేదని, వారి కార్యకలాపాలను నిలిపివేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. వారి ఆలోచనలు దేశానికి ప్రమాదకరమని, అవి యువకులను విషపూరితం చేస్తున్నాయని ఆయన అన్నారు.

సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారిన 6 నిమిషాల వీడియోలో తానే ఈ దాడికి బాధ్యత వహిస్తున్నానని, అక్కడ పేలుళ్లు జరిపింది తానే అని వెల్లడించారు. ఆరేళ్ల క్రితం ఆ సంస్థ తప్పుడు మార్గంలో వెళ్తుందని, వారి బోధనలు దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయని నేను గ్రహించానని, వాటిని మార్చుకోవాలని పలుమార్లు కోరానని, అయినప్పటికీ వారు అందుకు సిద్దపడలేదని వీడియోలో తెలిపారు.

దేశంలో నివసిస్తున్న ఇక్కడి ప్రజలను వారు వ్యభిచారులు అని పిలిచే వారని, వారు ఇతరులతో భోజనం చేయవద్దని, వారితో ఉండొద్దని కోరుతారని, వారి భావజాలం తప్పని గ్రహించానని మార్టిన్ వెల్లడించారు. ఓటు వేయద్దని, సైన్యంలో చేరవద్దని చెప్పేవారిని ఆరోపించారు. ఇలాంటి ప్రమాదకరమైన ఆలోచనలను వ్యాప్తి చేసే ఈ రకమైన సంస్థను నియంత్రించకపోతే, నాలాంటి వారి జీవితాలను త్యాగం చేయాల్సి ఉంటుందని అన్నారు. వారు ఎవరికీ సాయం చేయరు, ఎవరిని గౌరవించరు, దేశానికి వారు ప్రమాదకరంగా ఉన్నారని ఆయన ఆరోపించారు.