
IND vs ENG: ప్రపంచకప్ 2023లో భాగంగా లక్నోలో జరిగిన ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 100 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులు చేయగా.. 230 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లకు భారత బౌలర్లు షాకిచ్చారు. ప్రారంభం నుంచే దూకుడుగా బౌలింగ్ చేసి 34.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌట్ చేశారు.
Survival Story: రెండు వారాలుగా సముద్రంలో తప్పిపోయాడు.. చివరకు ఇలా బతికాడు..
ఇక భారత్ బౌలర్లు ఈ మ్యాచ్ లో అదరగొట్టారు. ఆరంభంలోనే జస్ప్రీత్ బుమ్రా పుంజుకోగా, ఆ తర్వాత మహ్మద్ షమీ కూడా మంచి ప్రదర్శన చూపించాడు. ఈ మ్యాచ్ లో షమీ 4 వికెట్లు పడగొట్టగా.. బుమ్రాకు 3 వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ 2, రవీంద్ర జడేజా ఒక వికెట్ సాధించాడు. ఇక ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో అత్యధికంగా లివింగ్ స్టన్ 27 పరుగులు చేశాడు.
Bandi Sanjay: బీఆర్ఎస్ను ఓడించేందుకు ఆ పార్టీ నేతలే కంకణం కట్టుకున్నారు..
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఓపెనర్లు రోహిత్ శర్మ (87) పరుగులు చేశాడు. గిల్ 9 పరుగులకే ఔటయ్యాడు. ఇక ఆ తర్వాత మిడిలార్డర్ లో వచ్చిన కేఎల్ రాహుల్ (39), సూర్యకుమార్ యాదవ్ (49) ఇన్నింగ్స్ ను చక్కదిద్ది.. స్కోరు బోర్డును కదిలించారు. అయితే 230 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ సునాయసంగా కొట్టేస్తుందని అందరూ అనుకున్నప్పటికీ, భారత బౌలర్ల విజృంభణతో వారికి చుక్కలు చూపించారు. ఈ విజయంతో ఇంగ్లాండ్ పై 20 ఏళ్ల పగను తీర్చుకుంది టీమిండియా. ఇదిలా ఉంటే.. వరల్డ్ కప్ 2023 వరుసగా ఆడిన 6 మ్యాచ్ ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలోకి వెళ్లింది.