Leading News Portal in Telugu

Hanuman: ఇది మాములు రికార్డ్ కాదు.. ఈ రికార్డ్ ను ఎవరు టచ్ కూడా చేయలేరు


Hanuman: ఇది మాములు రికార్డ్ కాదు.. ఈ రికార్డ్ ను ఎవరు టచ్ కూడా చేయలేరు

Hanuman: తేజ సజ్జ, అమ్రిత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయ్యిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సీనియమ్పి అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. హనుమాన్ చిత్రాన్ని పాన్ వరల్డ్ యూవీగా ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్నారు. ఈ సినిమాను ఏకంగా 11 భాషల్లో విడదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్‌, స్పానిష్‌, కొరియన్‌, జపనీస్‌, చైనీస్‌ సహా 11 భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుందని తెలుస్తోంది.

Jabardasth Rakesh: కేసీఆర్ పై సినిమా.. నన్ను మోసం చేశారు.. ఇల్లు, కారు అమ్ముకొని

అదేంటంటే.. ఏ సినిమాకు అయినా ముందు స్మోకింగ్ యాడ్ వస్తుంది. సినిమా మధ్యలో మద్యపానం, ధూమాపానం ఆరోగ్యానికి హానికరం అని వార్నింగ్ ఇస్తారు. అయితే హనుమాన్ సినిమాలో అలాంటిది ఏది లేదంట. సినిమా మొత్తం లో ఒక్క స్మోకింగ్ షాట్ కూడా ఉండదట. అందుకే సినిమా ముందు వచ్చే స్మోకింగ్ యాడ్ ను కూడా తొలగించారట. ఈ కాలంలో స్మోకింగ్ యాడ్ లేని సినిమా లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఇలాంటి సమయంలో కనీసం స్మోకింగ్ యాడ్ కూడా తీసేసేలా సినిమా చేశాడు అంటే ప్రశాంత్ వర్మను అభిమానులు ఓ రేంజ్ లో ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వార్త విన్న అభిమానులు ఇది మాములు రికార్డ్ కాదు.. ఈ రికార్డ్ ను ఎవరు టచ్ కూడా చేయలేరు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.