
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నరేంద్ర ప్రమాణస్వీకారం కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. సాయంత్రం 4.47 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి రాజ్‌భవన్‌కు జగన్ చేరుకుంటారు. అక్కడ ఏపీ హైకోర్టుకు కర్ణాటక హైకోర్టు నుంచి బదిలీ అయ్యి వచ్చిన జస్టిస్ జీ.నరేందర్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొనున్నారు. నవంబర్ 1న బుధవారం సీఎం జగన్ విజయవాడలో పర్యటించనున్నారు.. వైఎస్సాఆర్ లైఫ్ టైమ్ అచ్చీవ్‌మెంట్ అవార్డుల కార్యక్రమంలో గవర్నర్, సీఎం జగన్ పాల్గొంటారు. ఉదయం 10.48 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి విజయవాడ ఏ-కన్వెన్షన్ సెంటర్‌కు సీఎం జగన్ చేరుకుంటారు. ఏ-కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్‌ఆర్ లైఫ్ టైమ్ అచ్చీవ్‌మెంట్ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. తిరిగి మధ్యాహ్నానికి తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకోనున్నారు.