Leading News Portal in Telugu

చంద్రబాబు విడుదలైన క్షణం నుంచే జగన్ పతనం ఆరంభం :అచ్చెన్న | the fall of jagan begin with babu release| atchannaidu| tdp| cadre| happy| cbn


posted on Oct 31, 2023 1:30PM

స్కిల్  కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో టీడీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబుకు  బెయిల్ మంజూరైన వెంటనే మంగళగిరిలోని తెలుగుదేశం ప్రధాన కార్యాలయం వద్ద సందడి నెలకొంది. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు కార్యాలయం వద్దకు చేరుకుని సంబరాలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా అక్కడ మీడియాతో  మాట్లాడిన పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చంద్రబాబు  వ్యక్తిగత కక్ష తో ఆధారాలు లేకుండా జగన్ సర్కార్ కేసులు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబును రాజకీయ కక్షసాధింపుతోనే అరెస్ట్ చేసి జైలుకు పంపారనే విషయం ప్రజలందరికీ తెలిసిందన్నారు. అక్రమ కేసులతో చంద్రబాబును జైల్లో పెట్టి లబ్ధిపొందాలని సీఎం  జగన్ కుట్రలు చేశారని ఆరోపించారు.

నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు ఒక్కతప్పు కూడా చేయలేదని…అంతేకాదు పార్టీలో  మధ్యంతర బెయిల్ పై హైకోర్టు తీర్పు  రిజర్వ్ చేస్తే…రాత్రికి రాత్రే చంద్రబాబుపై లిక్కర్ కేసు పెట్టించిన సైకో వైఎస్ జగన్ అని విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్ జగన్ పతనానికి నాంది అని… బాబు జైలు నుంచి బయటకు అడుగు పెట్టిన క్షణం నుంచే  జగన్  పతనం ప్రారంభం అవుతుందని అచ్చెన్నాయుడు అన్నారు.