Leading News Portal in Telugu

IQOO 12 Launch: నవంబర్ 7న ‘ఐకూ 12’ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. సూపర్ డిజైన్, హై ఎండ్ ఫీచర్స్!


IQOO 12 Launch: నవంబర్ 7న ‘ఐకూ 12’ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. సూపర్ డిజైన్, హై ఎండ్ ఫీచర్స్!

IQOO 12 Smartphone Launch and Price: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ వివో సబ్‌ బ్రాండ్‌ ‘ఐకూ’ మరో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. గత కొంత కాలంగా ఎంతో హైప్ క్రియేట్ అయిన ఐకూ 12 స్మార్ట్‌ఫోన్.. 2023 నవంబర్ 7న లాంచ్ కానుంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను వివో రిలీజ్ చేసింది. టీజర్‌లో ఐకూ 12 లుక్, డిజైన్, గేమింగ్ చిప్‌ లాంటి వివరాలు రివీల్ అయ్యాయి. వివో సబ్‌బ్రాండ్‌గా ఐకూ భారత్‌లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

12 సిరీస్‌లో ఐకూ 12, ఐకూ 12 ప్రో మోడల్స్ భారత మార్కెట్లోకి రానున్నాయి. టీజర్ చూస్తే ఈ రెండు ఫాన్స్ కూడా సరికొత్త డిజైన్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఐకూ 12 స్మార్ట్‌ఫోన్‌లను గేమింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఫోన్ పర్పార్మెన్స్‌ను పెంచుతుంది. Q1 గేమింగ్ చిప్స్‌తో ఈ ఫోన్లు ఫాస్టెస్ట్, స్మూత్ ఫంక్షనింగ్‌తో.. గేమింగ్ లవర్స్‌కు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయని కంపెనీ పేర్కొంది.

ఐకూ 12 ఫ్లాట్ సైడ్స్‌తో వస్తుంది. ప్రో మాత్రం కర్వ్‌డ్ ఎడ్జెస్‌తో వస్తుంది. ఐకూ 12 ప్రో వైట్ కలర్‌లో గ్లాస్ బ్యాక్‌తో రానుంది. ఐకూ 12 మాత్రం రెడ్ కలర్ వేరియంట్‌లో లెదర్‌ బ్యాక్‌తో వస్తుంది. ఐకూ 12, ఐకూ 12 ప్రో స్మార్ట్‌ఫోన్‌లలో వెనుకవైపు స్క్విర్కిల్ కెమెరా మాడ్యూల్‌ ఉంటుంది. ఇందులో 50 ఎంపీ ఓమ్నివిజన్ OV05H ప్రైమరీ కెమెరా, 50 ఎంపీ శామ్‌సంగ్ JN1 అల్ట్రా-వైడ్ లెన్స్, 64 ఎంపీ OV64B పెరిస్కోప్ కెమెరాలు ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు 16GB RAM, 1TB వరకు వివిధ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఫోన్స్ ధర వివరాలు ఇంకా తెలియరాలేదు. ఐకూ 11 ప్రారంభ ధర భారత దేశంలో రూ. 59,999గా ఉంది. మార్కెట్ అనుగుణంగా ఐకూ 12 మోడల్ ధరలను తగ్గించే అవకాశం ఉంది.