
Maharashtra: మహారాష్ట్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొంత కాలంగా మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ డిమాండ్‌తో జరుగుతున్న ఉద్యమం ఇప్పుడు మహారాష్ట్రలో శరవేగంగా వ్యాపిస్తోంది. ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న మనోజ్ జరంగే గత వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. అలానే ఉద్యమంలో పాల్గొన్న యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే చాలంది యువత ప్రాణాలను కోల్పోయారు. కాగా సోమవారం నిరాహార దీక్ష చేస్తున్న మనోజ్ జరంగే ఆరోగ్యం క్షీణించింది. దీనితో ఉద్యమకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి లోనైనా ఉద్యమకారులు ముఖ్యమంత్రి షిండేపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జరంజే పరిస్థితిని చూసి ఉద్వేగానికి లోనైనా ఆందోళనకారులు ఆయన పరిస్థితిని సీఎం పట్టించుకోలేదని ఆరోపించారు.
Read also:Joe Biden: AIతో నష్టాలు.. కొత్త ప్రమాణాలు సిద్ధం చేయాలన్న జో బిడెన్
దీనితో ఉద్యమకారులు ఎమ్మెల్యేల నివాసాలకు, కార్యాలయాలకు , దుకాణాలకు నిప్పు పెడుతున్నారు. దీనితో మహారాష్ట్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అధికారులు సెక్షన్ 144 విధించింది. అలానే ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. కాగా ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని దాదాపు 32 ఏళ్ల క్రితం మరాఠా రిజర్వేషన్‌పై తొలిసారి ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమానికి మత్తడి లేబర్ యూనియన్ నాయకుడు నాయకత్వం వహించారు. అయితే మనోజ్ జరంగే నేతృత్వంలో ఈ ఉద్యమం మళ్ళీ మొదలయింది. ఈయన జాల్నాలో నిరాహార దీక్షకు కూర్చున్నారు. కాగా బీడ్ జిల్లాలో నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దీనితో బీడ్ ఉద్యమానికి కేంద్రంగా మారింది.