Leading News Portal in Telugu

Mohammed Siraj: వరల్డ్కప్ టోర్నీలో ఫామ్లో లేని స్టార్ బౌలర్.. తర్వాతి మ్యాచ్లకు కష్టమే..!


Mohammed Siraj: వరల్డ్కప్ టోర్నీలో ఫామ్లో లేని స్టార్ బౌలర్.. తర్వాతి మ్యాచ్లకు కష్టమే..!

2023 ప్రపంచకప్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరుస్తుంది. ఇప్పటి వరకు వరుసగా 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో బ్యాట్స్‌మెన్, బౌలర్లు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. కానీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మాత్రం ఈ టోర్నీలో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆసియా కప్లో విజృంభించిన సిరాజ్.. వరల్డ్కప్ మ్యాచ్లకు ఫామ్లో లేకపోవడం టీమిండియాకు ఇబ్బందిని కలిగిస్తోంది. మొదట ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక వికెట్ తీశాడు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌పై వికెట్లు తీయడంలో ఫెయిల్ అయ్యాడు. 9 ఓవర్లు వేసిన సిరాజ్.. 76 పరుగులు సమర్పించుకున్నాడు.

ఇక ఆ తర్వాత పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో 2 వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు. 8 ఓవర్లలో 50 పరుగులిచ్చి ఇద్దరిని ఔట్ చేశాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌పై కూడా.. 10 ఓవర్లలో 60 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇక ఆ తర్వాత న్యూజిలాండ్ పై ఒక వికెట్ తీశాడు. ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. మరో స్టార్ బౌలర్ మహ్మద్ షమీ విజృంభించడంతో కివీస్ బ్యాట్స్మెన్స్ డీలా పడిపోయారు. అత్యధికంగా మహ్మద్ షమీ 4 వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీశాడు.

ఇదిలా ఉంటే.. ఈ టోర్నీలో ఫామ్లో లేని సిరాజ్.. హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత డగౌట్లో కూర్చుని ఉండే అవకాశముంది. మహ్మద్ షమీ ఆడిన రెండు మ్యాచ్ల్లో వికెట్లు తీశాడు. అందువల్ల మిగతా మ్యాచ్లకు సిరాజ్ స్థానంలో.. షమీని ఆడించే అవకాశం ఉంది. ఇదే జరిగితే మహ్మద్ సిరాజ్ బయట కూర్చోక తప్పదు.