Leading News Portal in Telugu

Chandrababu Comments: నాకు సపోర్టు చేసిన అందరికి ధన్యవాదాలు


Chandrababu Comments: నాకు సపోర్టు చేసిన అందరికి ధన్యవాదాలు

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్ కేసులో 53 రోజుల జైలులో శిక్ష అనుభవించారు. ఇక, చంద్రబాబకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన్ని జైలు అధికారులు రిలీజ్ చేశారు. దీంతో చంద్రబాబు రిలీజ్ కావడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు తొలి సారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. తాను జైలులో ఉన్నప్పుడు సపోర్టు చేసిన అందరికి ధన్యవాదాలు తెలిపారు.. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. త‌న 45 ఏండ్ల సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్రలో ఏ త‌ప్పూ చేయ‌లేద‌న్నారు. నేను తప్పు చేయ‌ను.. చేయనివ్వను.. భవిష్యత్ లోనూ చేయ‌బోన‌ని టీడీపీ అధినేత పేర్కొన్నారు. “నేను కష్టంలో ఉన్నప్పుడు రోడ్డు పైకి వచ్చి సంఘీభావం తెలిపి.. మీరందరూ 52 రోజులుగా నాకు సపోర్టుగా నిలిచారు.. ఏపీ, తెలంగాణతో పాటు విదేశాల్లోనూ మద్దతు ఇచ్చారు.. నాకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు.

నేను చేసిన పనులతో లబ్ధి పొందిన వారంతా వచ్చి సంఘీభావం తెలిపినందుకు ధన్యవాదాలు అని చంద్రబాబు అన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓపెన్‌గా బ‌య‌ట‌కు వ‌చ్చి సపోర్టు ఇచ్చారు.. నాకు మద్దతు తెలిపిన జనసేన అధినేత పవన్ కు ధన్యవాదాలు.. హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో వచ్చి సపోర్టుగా నిలిచారు.. మీరు చూపించిన ఈ అభిమానం జీవితంలో మరిచిపోను అని చంద్రబాబు వెల్లడించారు. నాకోసం పూజలు, ప్రార్థనలు చేశారు.. సీపీఐ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు సంఘీభావం తెలిపినందుకు వారందరికీ నా ధన్యవాదాలు అని చంద్రబాబు చెప్పారు. ఇక స్పీచ్ తర్వాత చంద్రబాబు అక్కడ ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ.. కారు ఎక్కి విజయవాడకు బయలుదేరారు.